పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. 17 వసంతాల కలయిక

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో 2007-2008 విద్యా సంవత్సరం విద్యను అభ్యసించి 17 వసంతాల తర్వాత పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఒకరికొకరు తమ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.పాఠశాలలోని తమ తరగతి గదులు, వాటిలోని బెంచీలు, అక్కడ గడిపిన క్షణాలు, చేసిన అల్లరి, మాస్టర్లతో పెట్టించుకున్న చీవాట్లు గుర్తు చేసుకున్నారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.

ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉన్నామని దీనికి కారణం ఆరోజుల్లో గురువులు నేర్పిన క్రమశిక్షణే అన్ని కొనియాడారు.మధ్యాహ్నం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు దేవేందర్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సంతోష్ ,మధుసూదన్, షరీఫ్, హరికిషన్, ప్రణయ్ కుమార్, లింగయ్య, జయలక్ష్మి , నరేందర్ , పూర్వ విద్యార్థులు అనుదీప్, హరీష్, సాయి, శ్రీశైలం, శేఖర్, రేఖ మాధవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
కార్యకర్తల్ని కంటికి రెప్పల కాపాడుకుంటాం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోమిటిశెట్టి తిరుపతి

Latest Rajanna Sircilla News