Allu arjun : ఇది కదా అల్లు అర్జున్ అంటే.. 30 ఏళ్ల తర్వాత టీచర్ ను కలిసి కాళ్ళు మొక్కి అలా?

తాజాగా టీచర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు సామాన్యులు నెటిజన్స్ వారి టీచర్ల ఫోటోలు సోషల్ మీడియా( Social media )లో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

ఇంకొందరు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే అల్లు అర్జున్ చేసిన పనికి అభిమానులతో పాటు నేటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అంటే ఎలాగో చూపించారు అల్లుఅర్జున్.

తాజాగా తనకు మూడో తరగతి పాటలు చెప్పిన టీచర్ దాదాపుగా 30 ఏళ్ల తర్వాత కనిపించడంతో వెంటనే అల్లు అర్జున్ ఆమెను చూసి సంతోషపడి ఆమె కాళ్ళకు నమస్కారం చేసి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Allu Arjun Emotional Reunion With His School Teacher Throwback Video Viral

అల్లు అర్జున్( Allu arjun ) చేసిన పనికి అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆ వీడియోలను ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.అంతేకాకుండా అల్లు అర్జున్ యాటిట్యూడ్ చూపిస్తారు పొగరు ఉంది అనే వారికి ఈ ఫోటోలే చక్కటి ఉదాహరణ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Allu Arjun Emotional Reunion With His School Teacher Throwback Video Viral-Allu

కాగా అల్లు అర్జున్‌ మద్రాసులో చదువుకునేటప్పుడు మూడో తరగతిలో అంబికా రామకృష్ణన్ అనే టీచర్ పాఠాలు చెప్పారు.ఈ టీచర్ అంటే అల్లు అర్జున్‌కు ఎంతో ఇష్టం.

బన్నీకి చదువు పెద్దగా ఎక్కేది కాదు.అయినప్పటికీ అంబికా టీచర్ ఆయన్ని ఏమీ అనేవారు కాదట.

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో టాలెంట్ ఉంటుందని.నీలో ఉన్న టాలెంట్‌ను నువ్వే గుర్తించాలని ఆమె చెప్పేవారట.

Allu Arjun Emotional Reunion With His School Teacher Throwback Video Viral

అలా తనను ఎంతగానో ప్రోత్సహించిన తన చిన్ననాటి టీచర్ అంటే బన్నీకి ఎంతో ఇష్టం.అలాంటి టీచర్ 30 ఏళ్ల తర్వాత బన్నీ ముందుకు వచ్చారు.మూడు నెలల క్రితం చెన్నైలో బిహైండ్‌వుడ్స్ గోల్డ్ ఐకాన్స్ అవార్డుల ఫంక్షన్ జరిగింది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
ఆ ఆరు దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ ఎంట్రీ .. యూఏఈ కీలక నిర్ణయం

ఈ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నారు.ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Advertisement

ఈ సమయంలో వేదిక మీదికి అంబికా రామకృష్ణన్( Ambika Ramakrishnan ) వచ్చారు.ఆమెను చూసి ఆశ్చర్యపోయిన అల్లు అర్జున్.

తన చిన్ననాటి ఉపాధ్యాయురాలి కాళ్లకు నమస్కారం చేశారు.ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ తన టీచర్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు