ఐద్వా రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి: మల్లు లక్ష్మి పిలుపు

సూర్యాపేట జిల్లా:అక్టోబర్ 21,22,23 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( All India Democratic Womens Association ) (ఐద్వా) రాష్ట్ర 4వ,మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ( Mallu Lakshmi )పిలుపునిచ్చారు.

శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ జరిగిన సూర్యాపేట జిల్లా ఐద్వా మూడవ జిల్లా మహాసభకు ముఖ్య అతిథి హాజరై ఆమె మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, అత్యాచారాలు,హత్యలు పెరిగాయని,మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని బిజెపి ప్రభుత్వం రక్షిస్తుందని,బిజెపి పాలిత రాష్ట్రాలలో మతోన్మాదంతో మహిళలు తినే ఆహారం మీద,కట్టుకునే బట్టల మీద,ఆచార వ్యవహారాల మీద ఆంక్షలు విధిస్తూ మహిళలను బానిసలుగా చూస్తున్నారనిఆరోపిస్తూ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారిక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.పేద మహిళలందరికీ నెలకు రూ.2500 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందని, అధికారంలోకొచ్చి పది నెలలు అవుతున్నా ఇచ్చిన హామీని అమలు చేసిన పాపాన పోలేదన్నారు.సామాజిక పింఛన్లు రూ.2000 నుండి రూ.4000 లకు పెంచాలని,వ్యవసాయ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.12000 వెంటనే ఇవ్వాలని,రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి మహిళలకు ఉచిత విద్య,వైద్యం,రక్షణ కల్పించాలని,డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.

ఈ మహాసభల ప్రారంభ సూచికంగా ఐద్వా జెండాను ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే.ఎన్.ఆశలత ఆవిష్కరించగా,మద్దెల జ్యోతి,సురభి లక్ష్మి మహాసభలకు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ, జిల్లా నాయకురాళ్ళు తంగేళ్ల వెంకటచంద్ర, జూలకంటి విజయలక్ష్మి, షేక్ ఖాజాబీ,త్రివేణి, నారాయణమ్మ,దేవిరెడ్డి జ్యోతి,ఎడమ పద్మ, అండం వెంకటమ్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.

Aidwa Bhadradri Kothagudem , Bhadradri Kothagudem ,Mallu Lakshmi , Suryapet D
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

Latest Suryapet News