ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన గీత అలీతో సరదాగా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.250కు పైగా సినిమాలలో నటించిన గీత ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే సంగతి తెలిసిందే.గీత మాట్లాడుతూ ప్రస్తుతం చెన్నైలో ఉన్నానని మా ఆయన సీఏగా విధులు నిర్వహిస్తుండగా మా బాబు ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.
ఏడో తరగతి చదువుతున్న సమయంలో నేను ఇండస్ట్రీకి వచ్చానని గీత తెలిపారు.
మా నాన్నగారిది నెల్లూరు అని అత్తయ్యది చెన్నై అని గీత అన్నారు.కన్నడలో ఎక్కువగా ఏడ్చే పాత్రల్లో నటించానని అందువల్ల అక్కడ అందరూ ఏడుపు గీత అని పిలుస్తారని ఆమె తెలిపారు.
కృష్ణంరాజు, జయకృష్ణ వల్లే నాకు మనవూరి పాండవులు సినిమాలో ఛాన్స్ వచ్చిందని గీత అన్నారు.కృష్ణంరాజు లేరంటే చాలా బాధగా ఉందని ఆమె అన్నారు.
చిరంజీవి నా ఫేవరెట్ హీరో అని ఆయనతో ఒక్కసారైనా కలిసి నటించాలని ఉందని గీత తెలిపారు.చిరంజీవి కళ్లు అంటే నాకు చాలా ఇష్టమని చిరంజీవి ఎంతో డ్యాన్స్ చేస్తారని గీత అన్నారు.
నాలుగో తరగతిలో ఇంటికి ఆలస్యంగా వెళ్లానని నాన్న బెల్ట్ తో కొట్టారని గీత చెప్పుకొచ్చారు.బాలచంద్రుడు సినిమాలో మహేష్ తో కలిసి నటించానని ఆమె అన్నారు.1977లో ఇండస్ట్రీకి వచ్చానని గీత కామెంట్లు చేశారు.
ఒకే ఏడాదిలో నేను 18 సినిమాలలో నటించానని గీత అన్నారు.పెళ్లి తర్వాత సినిమాల విషయంలో విరామం తీసుకున్నానని గీత కామెంట్లు చేశారు.యాక్టింగ్ విషయంలో భర్త నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉందని గీత చెప్పుకొచ్చారు.
నా సినిమాలను చూసి అమ్మ ఎక్కువగా విమర్శించేవారని గీత కామెంట్లు చేశారు.గీత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.