పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి...!

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం అడివేముల గ్రామంలో విషాదం నెలకొంది.

సోమవారం గొర్ల మేపుతుండగా ప్రమాదవశాత్తు పిడుగుపాటుతో గొర్రెల కాపరి వడకల సైదులు (35) మృతి చెందాడు.

ఈ ఘటనలో అతనితో పాటు మూడు గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి.మృతుడి స్వగ్రామం తిమ్మాపురం కాగా అడివెముల గ్రామానికి బ్రతుకుతెరువు కొరకు వలస వచ్చి ఒక యజమాని వద్ద గొర్రెల కాపరిగా జీతం ఉండి జీవనం సాగిస్తున్నాడు.

మృతినికి భార్య,ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Latest Suryapet News