పేదలకు అండా దండ ఎర్రజెండా...!

సూర్యాపేట జిల్లా: పాలకవీడు మండలం మహంకాళిగూడెం గ్రామంలో సిపిఎం, సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం మేడే వారోత్సవాల్లో భాగంగా సిపిఎం సిఐటియు జెండాలను ( CPM )ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ పేదలకు అండా దండా ఎర్ర జెండా యేనని అన్నారు.


ప్రజల కోసం కార్మిక,కర్షక, యువజన,మహిళా సమస్యలపై నిరంతరం పోరాడేది ఎర్రజెండాయేననన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 42 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా చేస్తూ కార్మిక హక్కులను హరించి వేస్తున్నదన్నారు.

A Red Flag For The Poor People ,poor People, Cpm, Central Govt , Suryapet Distr

అమెరికా దేశంలోని చికాగో( Chicago ) నగరంలో 8 గంటల పని విధానం కోసం కార్మికుల పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ దేశంలో కార్మికులు పోరాడి ఎనిమిది గంట పని విధానాన్ని సాధించుకున్నారని,కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం(Central Govt ) దాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నదని దీని అందరూ ప్రతిఘటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ముషం నరసింహ,డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు రమేష్ మాలవత్,నాగు, హుస్సేన్,విజయరాజు, చెన్నయ్య,అంకమరావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News