నల్లగొండ జిల్లా:ధాన్యం కొనుగోలు( Grain ) లక్ష్యాన్ని పూర్తిచేయాలని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ( Bhaskar rao ) ఆదేశించారు.బుధవారంజిల్లా కేంద్రంలోని మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
అంతకు ముందు వ్యవసాయ అధికారులు మానిటరింగ్ అధికారులతో ఆయన మాట్లాడుతూ మిల్లర్ల సూచనల మేరకు ధాన్యం దిగుమతి లక్ష్యన్ని తగ్గించాలి తెలిపారు.
సన్నరకం ఎక్కువగా దిగుమతి చేసుకోవటం వలన మిలర్లలో స్థలం కొరత ఉన్నందున మిల్లర్ల సూచన ప్రకారం దిగుమతి లక్ష్యం 1.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చినట్లు తెలిపారు.ఇందులో ఇప్పటికీ 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేసుకున్నారని,మిగిలిన 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు.
ధాన్యం తక్కువగా దిగుమతి చేసుకున్న మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం దిగుమతి చేసుకోవాలని కోరారు.వ్యవసాయ అధికారులు ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి ధాన్యం నాణ్యత పరిశీలన చేసి సర్టిఫైడ్ చేయాలని ఆదేశించారు.
విధులో నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు,ఏడీఏ నాగమణి,సివిల్ సప్లై డిప్యూటీ తసీల్దార్ రామకృష్ణారెడ్డి,మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాద్యక్షుడు కర్నాటి రమేష్,అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి,ఎవోలు,ఎపిఎంఎస్ లు తదితరులు పాల్గొన్నారు.