కోదాడలో నూతన పోస్ట్ ఆఫీస్ భవనం నిర్మిస్తాం:ప్రధాని కార్యాలయం

సూర్యాపేట జిల్లా:కోదాడ( Kodada) పట్టణంలో నూతన పోస్ట్ ఆఫీస్ భవనం నిర్మిస్తామని ప్రధాని కార్యాలయం నుండి అధికారులు వెల్లడించిన విషయంపై జలగం సుధీర్( Jalagam Sudhir) హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

కోదాడ ప్రముఖ పట్టణంగా ఎదుగుతూ,అటు విద్యారంగం,ఇటు సిమెంట్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంటూనే,వ్యవసాయ రంగంలో తనదైన గుర్తింపు పొందిందని,పోస్టల్ డిపార్ట్మెంట్ సొంత బిల్డింగ్ లేకపోవడం,అనేక సంవత్సరాలుగా కిరాయి బిల్డింగ్ లో ఉండటం, నడిబొడ్డున ఉన్న పోస్టల్ ఖాళీ స్థలం కబ్జాలకు గురవుతున్నాయని,కేంద్ర మంత్రి సమాచారం అందించానని,అదే సమయంలో ప్రధానమంత్రి గ్రీవెన్స్ సెల్ (DPOST/E/2024/0021998) కూడా సమాచారం అందించామని తెలిపారు.2017 నుంచి తెలంగాణ పోస్ట్ మాస్టర్ జనరల్ ను హైదరాబాదులో కలిసి అలుపెరుగకుండా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నానని తెలిపారు.కోదాడ విషయం మీద పూర్తి రిపోర్ట్ తెప్పించుకొని అవసరమైతే కబ్జాల నుండి స్థలాన్ని కాపాడి,నూతన భవన నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రికి, ఉన్నతాధికారులకు జలగం సుధీర్ కృతజ్ఞతలు తెలిపారు.

How Modern Technology Shapes The IGaming Experience

Latest Suryapet News