అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిల ఆటకట్టు

సూర్యాపేట జిల్లా:మహిళల భద్రత కోసం షీ టీం ను సంప్రదించాలని,నవంబరు నెలలో 21 మంది పోకిరిలపై కేసులు నమోదు చేశామని,ఇకపై జిల్లాలో అమ్మాయిలను వేధించే ఆకతాయిల ఆటలు కట్టవుతాయని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా షీ టీమ్ విభాగం నవంబర్ నెలలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 38 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.

జిల్లా షీ టీమ్స్ ఇంచార్జీగా సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ నాగభూషణం పని చేస్తున్నారని,ప్రజలకు,విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం అంతర్జాలం ద్వారా సైబర్ వెబినార్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించే విధంగా అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టి విద్యార్థులను ప్రజలను చైతన్యం చేయడం జరిగిందన్నారు.షీ టీమ్స్ పట్టిష్టంగా పనిచేస్తున్నాయని సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పిస్తూనే విద్యార్థులను,మహిళలకు రక్షణ పట్ల కృషి చేస్తున్నట్లు తెలిపారు.దీనిలో భాగంగా బస్టాండు కాలేజ్ లకు సమీపంలో వేధింపులకు గురిచేస్తున్న వారిపై ఆకస్మికంగా రైడ్ చేసి 21 కేసులు,మొత్తం 24 కేసులు నమోదు చేయడం జరిగినదని చెప్పారు.38 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,6 ఫిర్యాదులు వచ్చాయి,ఫిర్యాదులలో కౌన్సిలింగ్ నిర్వహించామనన్నారు.కుటుంబ తగాదాల విషయంలో 6 పిటిషన్లు వచ్చాయి,ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ష్కరించడం జరిగిందన్నారు.

విద్యార్థినులను,మహిళలను వేధించే ప్రదేశాలు గుర్తించి నిరంతరం నిఘా ఏర్పాట్లు చేశామని,సైబర్ మోసాలపై జిల్లా షీ టీం నెంబర్ 8332901586 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం
Advertisement

Latest Suryapet News