స్టార్ హీరో ప్రభాస్ కు( Prabhas ) ప్రస్తుతం ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభాస్ తో ఒక్క సినిమా తీస్తే చాలు నిర్మాత లైఫ్ సెటిల్ అయినట్టేనని చాలామంది భావిస్తారు.
ప్రభాస్ తో సినిమాలను నిర్మించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి.అయితే ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్( Hombale Films ) బ్యానర్ లో ఇప్పటికే సలార్( Salaar ) సినిమాలో నటించగా ఆ బ్యానర్ లో మరో మూడు సినిమాల్లో నటించడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
సలార్2( Salaar2 ) కాకుండా మరో మూడు సినిమాలలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రభాస్ నటించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.2026 నుంచి వరుసగా ఏడాదికి ఒకటి చొప్పున ప్రభాస్ సినిమాలలో నటించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ కు ఈ ఆఫర్ బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.సలార్2 తర్వాత హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రభాస్ సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు జవాబులు దొరకాల్సి ఉంది.
ప్రభాస్ హోంబలే బ్యానర్ లో నటించే సినిమాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.హోంబలే బ్యానర్ రేంజ్ ను ప్రభాస్ సినిమాలు మరింత పెంచడం పక్కా అని చెప్పవచ్చు.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ సక్సెస్ రేట్ సైతం ఎక్కువనే సంగతి తెలిసిందే.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ కు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
2030 సంవత్సరం వరకు ప్రభాస్ బిజీ అని ఆయన డైరీలో డేట్లు ఖాళీ లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న ప్రభాస్ సక్సెస్ రేట్ మరింత పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.