The Apprentice : అమెరికన్ రాజకీయాలలో సెగలు రేపుతోన్న ట్రంప్ బయోపిక్

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్( Donald Trump) జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ ది అప్రెంటీస్’ ఆ దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.ట్రంప్‌ను రేపిస్ట్‌గా చిత్రీకరిస్తున్న ఈ సినిమాపై ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ విమర్శలు గుప్పించారు.

 The Apprentice : అమెరికన్ రాజకీయాలలో సె�-TeluguStop.com

తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్న ఈ చిత్ర నటీనటులు, నిర్మాతలపై దావా వేస్తామని స్టీవెన్ హెచ్చరించినట్లుగా న్యూయార్క్ పోస్ట్ వార్తాసంస్థ నివేదించింది.ఈ చెత్త (బయోపిక్) అనేది చాలాకాలంగా కొట్టివేసిన అబద్ధాలతో సంచలనం కలిగించే స్వచ్ఛమైన కల్పితంగా ఆయన అభివర్ణించారు.

Telugu Ali Abbasi, Biopic, Festival, Donald Trump, Ivana Trump-Telugu NRI

సోమవారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ది అప్రెంటీస్ .1970, 1980 దశకాలలో న్యూయార్క్‌ హై సొసైటీలో డొనాల్డ్ ట్రంప్ సాధించిన విజయాలు, వివాదాలను వివరిస్తూ నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొందినట్లుగా పేర్కొంది.ఇరానియన్ – డానిష్ చిత్ర నిర్మాత అలీ అబ్బాసీ ( Ali Abbasi )దర్శకత్వం వహించిన ఈ మూవీలో డొనాల్డ్ ట్రంప్ తన దివంగత మాజీ భార్య ఇవానా ట్రంప్‌( Ivana Trump )పై అత్యాచారానికి పాల్పడినట్లుగా చిత్రీకరించిన వివాదాస్పద సన్నివేశం ఉంది.

Telugu Ali Abbasi, Biopic, Festival, Donald Trump, Ivana Trump-Telugu NRI

జూలై 2022లో మరణించిన ఇవానా ట్రంప్.1989లో దాఖలు చేసిన తన విడాకుల పిటిషన్‌లో తాను లైంగిక వేధింపులకు గురైనట్లుగా పేర్కొన్నారు.అయితే దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఆమె తన దావాను ఉపసంహరించుకున్నారు.

తన మాజీ భర్త డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన నెల తర్వాత ఇవానా ఈ ప్రకటన చేశారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రచార ప్రతినిధి చియుంగ్.చిత్ర యూనిట్‌పై మండిపడ్డారు .77 ఏళ్ల ట్రంప్.త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్‌పై పోటీ చేయడానికి ఆరు నెలల ముందే సినిమా విడుదల కావడం ఎన్నికల్లో జోక్యంగా చియుంగ్ ఆరోపించారు.‘ది అప్రెంటీస్ ’లో యువ ట్రంప్‌గా సెబాస్టియన్ స్టాన్, ఇవానా ట్రంప్‌గా మరియా బకలోవా, ట్రంప్ న్యాయవాదిగా , ఫిక్సర్‌గా జెరెమీ స్ట్రాంగ్ నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube