Kuppam Constituency : కుప్పం లో రాజకీయ కుస్తీ .. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ? 

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ను ఎలాగైనా ఈసారి తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) టిడిపి అధినేత చంద్రబాబు అక్కడి నుంచే వరుసగా నుంచి గెలుస్తూ వస్తున్నారు.అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ఇంటికి పంపాలనే పట్టుదలతో వైసిపి ఉంది అందుకే ఈ నియోజకవర్గంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని పై చేయి సాధించే విధంగా ఈ నియోజకవర్గ పార్టీ వ్యవహారాలన్నిటిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కి జగన్ అప్పగించారు.

 Kuppam Constituency : కుప్పం లో రాజకీయ కుస్�-TeluguStop.com

ఈ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా భరత్ ను నియమించి ఎమ్మెల్సీగాను అవకాశం ఇచ్చారు.ఆయనను గెలిపిస్తే మంత్రి పదవిని ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Kuppamassembly, Telugudesam, Ysrcp-Politics

చిత్తూరు లోక్ సభ పరిధిలోకి వచ్చే ఈ కుప్పం నియోజకవర్గంలో  కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాలు ఉన్నాయి.జనాభా పరంగా చూస్తే వన్యకుల క్షత్రియులు ఎక్కువగా ఉన్నారు.ఆ తర్వాత మాల, కురువ , గాండ్ల కులస్తులు ఎక్కువగా ఉంటారు .ఇక్కడ టిడిపి ఆవిర్భావానికి ముందు 5 ఎన్నికలు జరిగాయి.1962 లో కమ్యూనిస్టు పార్టీ, 1967, 1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్ లు, 1955 1978లో కాంగ్రెస్ ఇక్కడి నుంచే గెలిచింది.1983లో టీడీపీ( TDP ) ఆవిర్భావం తర్వాత నుంచి ఇక్కడ ఆ పార్టీ హవానే నడుస్తోంది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Kuppamassembly, Telugudesam, Ysrcp-Politics

టీడీపీ ఆవిర్భావం తరువాత కుప్పం అసెంబ్లీ( Kuppam Assembly constituency ) సీటుకు మొత్తం తొమ్మిది ఎన్నికలు జరిగితే, ఇందులో అన్ని టిడిపిని గెలుచుకుంది.1983 నుంచి 2019 వరకు ఇక్కడ టిడిపినే గెలుస్తూ వస్తోంది.1983 , 85లో టిడిపి అభ్యర్థి రంగస్వామి నాయుడు ఇక్కడ నుంచి గెలవగా ఆ తరువాత ఏడుసార్లు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు.అయితే ఈసారి ఈ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించుకోవాలనే దృఢ సంకంల్పం తో జగన్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube