ఒక్క సినిమాతోనే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) డైరెక్షన్ మానేసి మళ్ళీ హీరోగా కెరియర్ పై ఫోకస్ చేశారు అనే విషయం మన అందరికీ తెలుసు.ఆయన జానీ సినిమాతో( Johnny Movie ) డైరెక్టర్ గా మారాడు.
కానీ హీరోగా ఎన్నో విజయాలను అందుకున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మాత్రం అపజయాన్ని చదివి చూడాల్సి వచ్చింది.ఆ సినిమా పరాజయానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి.
కానీ ఒక్క సినిమాతోనే పవన్ కళ్యాణ్ డైరెక్షన్( Pawan Kalyan Direction ) మానుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఆయన అభిమానులు చాలా రోజులుగా వేధిస్తున్న ప్రశ్న.ఏదేమైనా ఒక డైరెక్టర్ సక్సెస్ కొట్టాలి అంటే దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.
సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ గా డైరెక్టర్ ని పిలుస్తారు.అన్ని క్రాఫ్ట్స్ ని సరిగా చూసుకోవాల్సిన అవసరం కూడా డైరెక్టర్ పై ఉంటుంది.పైగా హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేయడం అనేది ఒక కొత్త దర్శకుడికి సాధ్యమయ్యే పనికాదు.అయినా కూడా ఆయన ఆ పని చేశారు.కాస్త స్లో నరేషన్ కారణంగా మరియు కొన్ని సీన్స్ పేలవంగా కూడా వచ్చిన కారణంతో జానీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ ఆ సినిమా చాలా ఎంగేజింగ్ గా ప్రేక్షకులను కథ తో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాకుండా మరొక కొత్త హీరో నటించి ఉండి ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకునేది.ఇక టాలీవుడ్ లోనే కాదు అన్ని సినిమా రంగాల్లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంటుంది.ఏదైనా సినిమా అద్భుత విజయం సాధించింది అంటే ఆ సినిమాలో నటించిన హీరో లేదా హీరోయిన్ కి ఆ తర్వాత సినిమాలు అదే రేంజ్ సక్సెస్ ని కొట్టాలంటే జరిగే పని కాదు.
ఉదాహరణకు మహానటి సినిమా( Mahanati Movie ) తర్వాత కీర్తి సురేష్( Keerthy Suresh ) దాదాపు డజన్ ప్లాపులను చవి చూసింది.అల్లూరి సీతారామరాజు( Alluri Sitaramaraju ) సినిమా తర్వాత కృష్ణ కూడా 10 సినిమాల వరకు పరాజయాలను ఎదుర్కొన్నాడు
అలాగే ఖుషి సినిమా( Kushi Movie ) కారణంగా పవన్ కళ్యాణ్ రేంజ్ బాగా పెరిగిపోవడంతో ఆ తర్వాత వచ్చిన జానీ సినిమాకు కంపారిజన్ ఎక్కువైపోయి జానీ సినిమాను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.దాంతో ఈ సినిమా పరాజయం అందుకుంది.అయినా కూడా కథ పై డిమాండ్ స్క్రీన్ పై పట్టు ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ డైరెక్షన్ చేస్తే చూడాలని అందరూ కోరుకుంటున్నారు.
ఆయన మరోసారి డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా విజయం కూడా సాధించగలరు.