వాల్మీకి రామాయణంలో శ్రీరాముని జన్మ నక్షత్రం, సమయం, ముహూర్తం, రాశి చక్రం గురించి సమాచారం ఉంటుంది.అయితే శ్రీరాముడు( Lord Rama ) జన్మించిన నక్షత్రంలో పుట్టిన వారికి రాముడి లక్షణాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జోతిష్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.జాతకాన్ని బట్టి ఒక వ్యక్తిని జ్యోతిష్యం అంచనా వేస్తుంది.
ఇది ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ వివాహం, ఆరోగ్యం సహాయం అందిస్తుంది.అయితే జాతకం( Horoscope )లో శుభగ్రహాలు బలంగా ఉన్నప్పుడు వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు.
భవిష్యత్తులో మీకు ప్రతిష్ట కూడా పెరుగుతుంది.
అలాగే శుభగ్రహాలు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో కష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే నక్షత్రాల ప్రకారం జాతకుని భవిష్యత్తు నిర్ణయించబడుతుంది.శ్రీరాముడు ఏ నక్షత్రంలో జన్మించాడో ఆ నక్షత్రంలో మీరు జన్మిస్తే ఏ లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాముడు చైత్రమాంసం, శుక్లపక్షంలో 9వ రోజున, కర్కాటక లగ్నం పునర్వసు నక్షత్రం( Punarvasu )లో జన్మించారు.పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి భగవంతుడు పై అపారమైన విశ్వాసము ఉంటుంది.
అలాగే పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి ప్రవర్తన చిన్నప్పటినుండే చాలా సౌమ్యంగా సున్నితంగా ఉంటుంది.
అలాగే వీరి వయసు ఎంత పెరుగుతున్నా కూడా వీరిని ప్రజలు ఇష్టపడటం తగ్గిపోతారు.వీరికి శారీరక సుఖాల పట్ల విరక్తి ఉంటుంది.అలాగే దేవుడు ఇచ్చిన దాంట్లోనే తృప్తి చెందుతారు.
వీళ్ళు అధర్మ మార్గాన్ని అనుసరించడానికి అస్సలు ఇష్టపడరు.ఈ నక్షత్రంలో జన్మించిన వారికి విశాలమైన హృదయం కూడా ఉంటుంది.
అలాగే వీరిలో శ్రీరాముడి వంటి సుగుణాలు కూడా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.అయితే ఎవరైతే ఈ నక్షత్రంలో జన్మించారో వారికి ఈ గుణాలతో పాటు శ్రీరాముడి సుగుణాలు కూడా ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రంలో పుట్టిన వారు శ్రీరాముడు లాంటి సుగుణాలతో పాటు ఆయన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు.
DEVOTIONAL