అమ్మమ్మ పాత ఇంట్లో సీక్రెట్ న్యూక్లియర్ బంకర్‌ను కనుగొన్న మహిళ..

సాధారణంగా కొన్ని పాత ఇళ్లల్లో( Old Homes ) ఇంతకుముందు వాటిలో నివసించిన మనుషుల వస్తువులు లేదా దాచిపెట్టిన నిధులు, విలువైన సంపద దొరుకుతుంది.ఒక్కోసారి కొత్తగా ఇంట్లోకి వచ్చిన వారికి ఊహించని సర్‌ప్రైజ్‌లు కూడా పలకరిస్తుంటాయి.

 Woman Discovers Secret Nuclear Bunker In Grandmas Old House Details, Viral News-TeluguStop.com

తాజాగా ఒక టిక్‌టాకర్ కూడా తన అమ్మమ్మ పాత ఇంట్లో ఒక రహస్యాన్ని కనుగొంది.ఆ ఇల్లు పాతది, అందులో నేల కింద హిడెన్ డోర్( Hidden Door ) ఉంది.

డోర్ న్యూక్లియర్ బంకర్( Nuclear Bunker ) లాగా కనిపించే నేలమాళిగకు దారితీసింది.మహిళ, ఆమె సోదరుడు బేస్మెంట్ లోపలికి వెళ్లారు.

వారు అక్కడ చూసిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.ఆ మహిళ తాను తన అమ్మమ్మ ఇంట్లో కొనుగొన్న ఈ సీక్రెట్ డోర్, నేలమాళిగను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆమె కనుగొన్నదాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంది.

Telugu Bunker, Secrets, Grandmas, Hidden Door, Nuclear Bunker, Discovery, Secret

నేలమాళిగలో చాలా ఆహారం, తుపాకీ సేఫ్, కొన్ని విచిత్రమైన ఎలక్ట్రికల్ బాక్స్‌లు ఉన్నాయి.అందులో గ్యాస్ మాస్క్‌లు, బెడ్‌లు, బావి, నీటి వనరు కూడా ఉన్నాయి.ఎవరో విపత్తు రోజుల్లో బతకడానికి వీటిని సమకూర్చినట్లు ఉన్నారు.

మహిళ, ఆమె సోదరుడు తోటలో మరొక రహస్య తలుపును( Secret Door ) కనుగొన్నారు.ఇది కూడా నేలమాళిగకు కనెక్ట్ అయింది.

నేలమాళిగ ఎంత లోతుగా, పెద్దగా ఉందో వీక్షకులకు చూపించారు.

Telugu Bunker, Secrets, Grandmas, Hidden Door, Nuclear Bunker, Discovery, Secret

వీక్షకుల నుంచి భిన్నమైన స్పందన వచ్చింది.హంతకుడు దాక్కున్న ప్రదేశంలా భయానకంగా ఉందని కొందరు కామెంట్స్ చేశారు.దాగిన ఈ నేలమాళిగ తలుపు కథ చాలా ఆసక్తిని రేపింది.

తెలియని వారి కోసం ఒక కుటుంబం ఎలా ప్లాన్ చేసిందో ఇందులో చూపించారు.ఇది పాత ఇళ్లలో దాచిన విషయాల గురించి చర్చను కూడా ప్రారంభించింది.

ఇక లేడీ టిక్‌టాకర్ తన అమ్మమ్మ ఇంటికి వెళ్లడమే ఒక పెద్ద సాహసంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube