మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏ పార్టీకైనా ఎత్తులు పల్లాలు తప్పవని పేర్కొన్నారు.2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని తెలిపారు.
అప్పుడు సంస్థాగతంగా గట్టిగా లేకున్నా ప్రజలు దీవించారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పుడు 119 సీట్లలో 39 సీట్లు గెలిచామన్న కేటీఆర్ ఇది తక్కువ సంఖ్య కాదని చెప్పారు.కేసీఆర్ సీఎం కానందుకు ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు.నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని మండిపడ్డారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని పేర్కొన్నారు.
అప్పులను బూచీగా చూపి హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని తెలిపారు.