టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చారు.
ఇటీవల ఈయన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆస్కార్ అవార్డున సైతం అందుకున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరిచిత్రం మహేష్ బాబు( Mahesh Babu ) తో చేస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత ఈయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారన్న విషయంపై ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత బాహుబలి 3 తీస్తారని లేదు రామ్ చరణ్( Ram Charan ) తో మరో సినిమా చేయబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ జాబితాలోకి హీరో సూర్య ( Suriya ) కూడా వచ్చారు.మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి హీరో సూర్యతో సినిమా చేస్తారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
నిజానికి మగధీర సినిమా తరువాతనే సూర్య రాజమౌళితో సినిమా చేయాల్సి ఉండేదట కానీ అప్పటినుంచి కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
మగధీర సినిమా తర్వాత రాజమౌళితో సూర్య సినిమా చేయడం కోసం కొంత డబ్బును రాజమౌళికి కూడా ఇచ్చారట.ఇలా సినిమా పనుల కోసం స్వయంగా సూర్యనే డబ్బులు ఇచ్చినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా మాత్రం తెరపైకి రాలేదు.దీంతో మహేష్ బాబు సినిమా తర్వాత సూర్యతోనే సినిమా చేయాలని చెప్పారట.
అప్పట్లో సూర్య రాజమౌళికి ఇచ్చినటువంటి డబ్బు వడ్డీతో సహా ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు అయ్యి ఉంటుందని, కానీ రాజమౌళి మాత్రం సూర్యతో ఇంకా సినిమా అనౌన్స్ చేయలేదని తెలుస్తుంది.మహేష్ బాబు సినిమా తర్వాత మరీ రాజమౌళి సూర్య( Rajamouli Suriya Combo )తోనే చేస్తారా అసలు వీరిద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.