అలా చేసి ఉంటే హాయ్ నాన్న మూవీ ఇంకా బాగుండేది.. పరుచూరి షాకింగ్ రివ్యూ వైరల్!

2023 సంవత్సరంలో విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకున్న సినిమాలలో హాయ్ నాన్న( Hi Nanna Movie ) ఒకటి.నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

 Paruchuri Gopalakrishna Nani Hi Nanna Movie Review Details, Paruchuri Gopalakris-TeluguStop.com

శౌర్యువ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.కథ కొత్తగా లేకపోయినా కథనం అద్భుతంగా ఉండటం, ప్రధాన నటీనటుల అద్భుతమైన అభినయం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో( Netflix ) స్ట్రీమింగ్ అవుతోంది.ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopalakrishna ) ఈ సినిమా గురించి మాట్లాడుతూ నాని( Nani ) వైవిధ్యమైన కథలను ఎంచుకుంటాడని స్క్రీన్ ప్లే వల్లే ఈ సినిమా హిట్టైందని తెలిపారు.

ఏఎన్నార్, శోభన్ బాబు బాడీ లాంగ్వేజ్ నానిలో ఉందని పరుచూరి అభిప్రాయపడ్డారు.కూతురు సెంటిమెంట్ ను( Daughter Sentiment ) జోడించడం వల్లే సినిమా హిట్టైందని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Nani, Mrunal Thakur, Nanna, Nani Nanna, Paruchurinanna, Shouryuv-Movie

చివర్లో పది నిమిషాలు కట్ చేయొచ్చని అలా చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేదని పరుచూరి అభిప్రాయపడ్డారు.సినిమాలో డైలాగ్స్( Dialogues ) కూడా చాలా సరళంగా ఉన్నాయని ప్రేక్షకుల మనస్సును గెలవాలనుకుని అదే విధంగా డైలాగ్స్ రాశారని పరుచూరి పేర్కొన్నారు.బ్రతకడం కష్టం అనుకునే పాపను తండ్రి రక్షించుకున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుందని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Nani, Mrunal Thakur, Nanna, Nani Nanna, Paruchurinanna, Shouryuv-Movie

హాయ్ నాన్న చాలా బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు.2023 సంవత్సరంలో నాని ఇద్దరు కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి ఆ రెండు సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్సైన ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

హృదయానికి హత్తుకునే కథలలో నటిస్తూ నాని నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.నాని పారితోషికం 28 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube