కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం విమానాశ్రయంలో పది రూపాయలకే భోజనం..!!

ఈ ఏడాది మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో( Karnataka ) జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడం తెలిసిందే.ఈ ఎన్నికలలో కర్ణాటక ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

 The Sensational Decision Of The Karnataka Government Is Ten Rupees Meal At The A-TeluguStop.com

ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య.( CM Siddaramaiah ) ప్రజలను ఆకట్టుకునే విధంగా పాలన అందిస్తూ ఉన్నారు.

ఒకపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే మరోపక్క కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో పది రూపాయలకే భోజనం అందించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమయ్యింది.

మామూలుగా బెంగళూరు విమానాశ్రయంలో( Bangalore Airport ) ధరలు చూస్తే ఫుల్ మిల్స్ కి వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది.టీ, కాఫీలు అయితే 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలకే బెంగళూరు విమానాశ్రయంలో భోజనం అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో రెండు ఇందిరా క్యాంటీన్లు( Indira Canteens ) ప్రారంభించేందుకు క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది.

అంతేకాదు పది రూపాయల భోజనంతో పాటు త్వరలో ఐదు రూపాయలకే అల్పాహారం అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube