కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రైస్ మిల్లర్లకు దడ మొదలైందని తెలిపారు.
ఇన్నాళ్లు రైతులను రైస్ మిల్లర్లు వేధించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.తాలు అంటూ క్వింటాకు పది కిలోల కోత పెట్టారని ఆరోపించారు.
రైస్ మిల్లర్లకు ఇక ఉరి తాడేనని చెప్పారు.రైతులను వేధిస్తే ప్రభుత్వ తడాఖా చూపిస్తామని స్పష్టం చేశారు.