సినిమాల్లో ఉంటే రాజకీయాలు చెయ్యకూడదు, రాజకీయాల్లో ఉంటే సినిమాలు చెయ్యకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు.ఎందుకంటే రెండు రంగాలు కూడా మహాసముద్రలు వంటివి, ఒకేసారి రెండు పడవల మధ్య కాళ్ళు పెట్టి ప్రయాణించడం అసాధ్యం.
ఇప్పటి వరకు ఎవరూ అలా సక్సెస్ సాధించలేకపోయారు.కానీ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మాత్రం సక్సెస్ కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాడు.
కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ఆయన జనసేన పార్టీ స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసాడు.తొలుత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చెయ్యకుండా కేవలం టీడీపీ – బీజేపీ కి సపోర్టు ఇచ్చి ఆ కూటమి అధికారం లోకి రావడానికి కారణం అయ్యాడు.
ముఖ్యంగా అప్పట్లో ఆయన ‘కాంగ్రెస్ హటావో.దేశ్ బచావో’ అనే నినాదం తో కాంగ్రెస్ పార్టీ లో ఏ స్థాయి వణుకు పుట్టించాడో మన అందరికీ తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకొని పోవడానికి ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా ఒక కారణం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )చేసిన ఎన్నికల ప్రచారం పై ఆవేశం తో రగిపోయే నాయకులూ తెలంగాణాలో చాలా మండే ఉన్నారు.పవర్ లోకి వచ్చిన తర్వాత ఒక్కొకరికి సమాధానం చెప్తాం చూడు అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులూ చాలా కాలం నుండి చెప్తూనే ఉన్నారు.కానీ గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికలలోను బీఆర్ ఎస్ పార్టీనే ఘన విజయం సాధించింది.
అయితే ఈసారి అధికారం లోకి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలకు తెలంగాణ ప్రాంతం లో కూడా ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు.పవన్ కళ్యాణ్ గత మూడు చిత్రాలను ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ సర్కార్ ఏ రేంజ్ లో తొక్కిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.
అదే స్థాయిలో తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పార్టీ( Congress party) పవన్ కళ్యాణ్ సినిమాలను తొక్కేస్తుంది ఏమో అని అభిమానులు కంగారు పడుతున్నారు.
కొంతమంది చెప్పేది ఏమిటంటే జగన్ లాగ ఎవ్వరూ కూడా కుట్రపూరితంగా రాజకీయాలు చెయ్యరు.2014 ఎన్నికల సమయం లో పవన్ కళ్యాణ్ కేసీఆర్ ని ‘తాట తీస్తా కేసీఆర్‘ ( CM kcr )అంటూ చేసిన కామెంట్స్ ఎలాంటి దుమారం రేపిందో మనమంతా చూసాము.కానీ బీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలపై తెలంగాణ లో ఎలాంటి టార్గెట్ చెయ్యలేదు.
అందరి హీరోలకు ఇచ్చిన్నట్టు గానే అదనపు షోస్ మరియు టికెట్ హైక్స్ వంటివి కూడా ఇచ్చారు.కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమి లేదంటూ కొంతమంది అభిమానులు భరోసా ఇస్తున్నారు.