అయ్యప్ప భక్తులు 41 రోజుల పాటు సాధారణ జీవితం గడుపుతూ స్వామి వారిని ఆరాధిస్తారు.కటిక నేలపై పడుకొని తెల్లవారుజామునే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేస్తారు.
మండలం రోజుల తర్వాత శబరిమలకు ప్రయాణమవుతారు.ఈ సమయంలో స్వామి వారిని పూజిస్తేనే భక్తుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మరి శబరిమల యాత్రకు వెళ్లి తిరిగి వచ్చేంతవరకు భక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.అయ్యప్ప భక్తులు( Ayyappa devotees ) కఠినమైన నియమాలతో 41 రోజుల పాటు మండల దీక్ష చేస్తారు.
ఈ సమయంలో తెల్లవారుజామునే నిద్ర లేచి చల్ల నీళ్లతో స్నానం చేయడం, నేలపై నిద్రపోవడం వంటి నియమాలు ఎన్నో పాటిస్తారు.

మండల కాలం తర్వాత ఇరుముడిని కట్టుకుని శబరిమలకు వెళ్లి మకర జ్యోతి( Makara Jyothi )ని దర్శించిన తర్వాత దీక్షను విరమిస్తారు.ఈ మండల కాలంలో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూనే భక్తులు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపణులు చెబుతున్నారు.మీకు ముందు నుంచి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకోవాలి.
శబరిమల యాత్రలో ఎత్తైన పర్వత శ్రేణుల్లో కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది.కాబట్టి ఒక నెల రోజుల ముందు నుంచే నడకను మొదలుపెట్టాలి.పండ్లు, ఆకుకూరలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి.
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు షుగర్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.

40 సంవత్సరాలు దాటిన భక్తులు మండల దీక్ష సమయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.సన్నిధానానికి ఏటవాలుగా ఉన్న కొండను ఎక్కే సమయంలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి.కొండ ఎక్కే సమయంలో నీళ్లను ఎక్కువగా తాగాలి.
ఆయిల్ ఫుడ్, మసాలాకు దూరంగా ఉండాలి.ఆస్తమా, సైనస్, శ్వాస కోశా సమస్యల( Respiratory problems )తో బాధపడేవారు తమ వెంట ఇన్ హేలర్ ను తీసుకొని వెళ్లడం మంచిది.
అలాగే రద్దీ రోజుల్లో సన్నిధానంలో బస చేయకపోవడమే మంచిది.స్వామి దర్శనం తర్వాత తిరిగి పంబకు చేరుకోవడం మంచిది.
ఇరుముడితో పాటు నగదు, వస్తువులు, బ్యాగుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి పంబ నదిలో స్నానం చేసేటప్పుడు భక్తులు జాగ్రత్తగా ఉండాలి.
LATEST NEWS - TELUGU