బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కెరియర్ మొదట్లో పలు సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇలా సీరియల్స్ ద్వారా తన ప్రస్థానం మొదలు పెట్టిన సుమ ప్రస్తుతం యాంకర్ గా కొనసాగుతున్నారు.
ఈమె యాంకర్ గా విధులు నిర్వర్తిస్తున్నప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేది.అయితే ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా కొనసాగిన వారందరూ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా సుమ కూడా వెండితెరపై ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సుమ జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ విషయాన్ని సుమారు గత కొన్ని రోజుల క్రితం ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.అసలు సుమ సినిమాలలో నటిస్తుంది అనే విషయాన్ని ఎక్కడా కూడా తెలియజేయకుండా, చకచకా షూటింగ్ పనులను ప్రారంభించి మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇక ఈ సినిమాకు మద్దతుగా ఎంతో మంది బుల్లితెర స్టార్స్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కార్తీకదీపం డాక్టర్ బాబు, వంటలక్క రంగంలోకి దిగి జయమ్మ పంచాయతీ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.ఈ విషయంపై సుమ స్పందిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

ఎప్పుడు అందరి పై పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉండే సుమ సినిమాలో ఎంతో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు.ఇలా సీరియస్ లుక్ లో సుమ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.