కూటమిలో కుంపటి !

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయా ? అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ గా భావించింది కాంగ్రెస్ పార్టీ.

 Differences In The Coalition, Congress , Bjp, Rahul Gandhi, Mamata Banerjee , So-TeluguStop.com

కనీసం నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది.కానీ ఊహించని రీతిలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ( BJP ) విజయం సాధించగా కేవలం ఒక్క రాష్ట్రాన్ని మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో ముసలం మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.</br

Telugu Akhilesh Yadav, Congress, Mamata Banerjee, Nitish Kumar, Rahul Gandhi, So

మోడి సర్కార్ కు చెక్ పెట్టె దిశగా ఇండియా కూటమి ఏర్పాటైన సంగతి తెలిసిందే.ఈ కూటమిలో నితిశ్ కుమార్, మమత బెనర్జీ( Mamata Banerjee ), అఖిలేశ్ యాదవ్, వంటి హేమాహేమీలు ఉన్న సంగతి విధితమే.కాగా ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో ఇతర పార్టీలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించిందనే అసహనం కూటమిలొని కొంతమంది నేతల్లో ఉన్నట్లు నేషనల్ పాలిటిక్స్ లో వినికిడి.

గత కొన్నాళ్లుగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందనే విమర్శ కూడా వినిపిస్తోంది.</br

Telugu Akhilesh Yadav, Congress, Mamata Banerjee, Nitish Kumar, Rahul Gandhi, So

కూటమి ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన నితిశ్ కుమార్ ను కూడా హస్తం పార్టీ లైట్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాంతో కూటమిలో ముసలం ఏర్పడినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో రేపు కూటమికి సంబంధించిన సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి మమత బెనర్జీ, నితిశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్( Akhilesh Yadav ) వంటి వారు దూరంగా ఉంటున్నాట్లు టాక్ వినిపిస్తోంది.దీంతో ఇండియా కూటమిలో నేతల మద్య ఐక్యత లేదనే విషయం మరోసారి బయట పడింది.

మరి కూటమిలో అంతర్గత కుమ్ములాటలు పెరిగితే ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల ముందు గట్టిగానే ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది.మరి కాంగ్రెస్ పార్టీ ఈ తరహా అసంతృప్తిని తగ్గించి కూటమిలో ఐక్యత తీసుకొస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube