మంత్రిగారి భార్యకు కరోనా, మంత్రి తో సహా 40 మంది...

కరోనా తో పేదప్రజల కంటే కూడా మంత్రులు,సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన ఎక్కువ పడుతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ భార్య,మాజీ మంత్రి అమృత రావత్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.

ఇటీవల అస్వస్థతకు గురైన అమృత రావత్ నమూనాలను సేకరించిన వైద్యులు డెహ్రాడూన్ లోని ఒక ప్రయివేట్ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించారు.అయితే, ఆ నివేదికలో ఆమె కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.

అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు.ఇక, మంత్రి భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మంత్రి సత్పాల్ మహారాజ్‌తో పాటు నలభై మందిని హోం క్వారంటైన్‌లో పెట్టారు.

మరోవైపు.తన భార్యకు కోవిడ్ 19 పాజిటివ్‌గా ధృవీకరించారు మంత్రి.

Advertisement

నా భార్యకు గత మూడు, నాలుగు రోజులుగా జ్వరం వచ్చింది.మొదట, ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు నిర్వహించాం.

నెగిటివ్‌గా వచ్చింది.అయితే మళ్లీ శనివారం కోవిడ్ -19 పరీక్షలు చేయించడంతో పాజిటివ్‌గా వచ్చిందన్నారు.

తన కుటుంబం, భార్యతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్య శాఖ ప్రోటోకాల్‌ను అనుసరించి నిర్బంధంలోకి వెళతారని మంత్రి తెలిపారు.చికిత్స కోసం తన భార్యను ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు.

ఇక, ఉత్తరాఖండ్‌లో మరో 22 మంది శనివారం కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చింది.దీంతో.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 749 కి చేరుకుంది.కొత్తగా నమోదైన 22 కేసుల్లో.14 డెహ్రాడూన్, 3 హరిద్వార్, 5 నైనిటాల్‌లో నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.మరోవైపు ఈ కరోనా మహమ్మారి కి భారత్ అల్లాడుతోంది.

Advertisement

గడచిన 24 గంటల్లో 8 వేలకు పైగా కేసులు నమోదు అవ్వడం మరింత ఆందోళన కలిగిస్తుంది.నిపుణులు హెచ్చరించినట్లు జూన్,జులై నెలల్లో కరోనా భారత్ లో విలయతాండవం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా వార్తలు