ఆ సినిమాపైనే కంచె బ్యూటీ ఆశలు.. నెరవేరతాయా..?

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ.

సినిమాలలో మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది.పలు సినిమాల్లో నటించిన ప్రగ్య.అంతగా పైకి రాలేకపోయింది.2014లో తెలుగు, హిందీ సినిమా లతో ఒకేసారి సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ.కొంత వరకు తన నటనకు టాలీవుడ్ పరిశ్రమ మరిన్ని అవకాశాలు అందించింది.

ఇక మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా తనకు మంచి గుర్తింపు అందించగా.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా క్రేజ్ మాత్రం అందుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాకైనా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా అఖండ.

Advertisement

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ మధ్య కొన్ని సీన్ లను చిత్రీకరించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న తాజా షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పానని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ప్రగ్యా.అంతేకాకుండా ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది.

హీరోయిన్ పూర్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందట.ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా అతి తక్కువ సమయంలో 50 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.ఈ సినిమాను మే 28న విడుదల చేయడానికి ప్రకటించగా.

Advertisement

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగులు వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా కూడా విడుదలకు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజా వార్తలు