నెల్లూరు జనసేన పార్టీ నాయకులపై వైసీపీ మూకుమ్మడి దాడి..పరిస్థితి ఉద్రిక్తం!

వైసీపీ పార్టీ పాలనలో ఇసుక మాఫియా( Sand Mafia ) ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేసాడు.

 Ycp Leaders Attack On Janasena Leaders Over Questioning On Sand Mafia In Duvvuru-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇసుక ని చోరీ ఎలా చేస్తుందో జనాలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు.ఆ రేంజ్ లో భయపడిన తర్వాత కూడా వైసీపీ పార్టీ అక్రమంగా ఇసుకని దోచుకోవడం ఆపలేదు.

దందా చేస్తూనే ఉంది.పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తిగా జనసేన పార్టీ నాయకులూ ఈ ఇసుక దందా పై యుద్ధం చేస్తూనే ఉన్నారు.

ఎవరైతే ఈ ఇసుక దందాకు అడ్డు వస్తున్నారో వాళ్ళ నోర్లు మూయించడం, కొట్టించడం, ఇలా రౌడీ దుర్మార్గపు చర్చలకు స్థానంగా ఉండే వైసీపీ నాయకులూ చేస్తూనే ఉన్నారు.

రీసెంట్ గా నెల్లూరు జిల్లాలో( Nellore District ) ఇదే సీన్ రిపీట్ అయ్యింది.

దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా మాట్లాడుకుంటున్నారు.ఇక అసలు విషయానికి నెల్లూరు జిల్లాలోని దువ్వూరు ప్రాంతం లో గత కొంత కాలం నుండి ప్రతీ రోజు అక్రమంగా ఇసుకని తరలిస్తూనే ఉన్నారు.

స్థానికులు ఎంత అడ్డుకోవాలని చూసిన వారి వల్ల అవ్వలేదు.దీంతో ఆ చుట్టుపక్కన ఉన్న స్థానికలందరూ కలిసి జనసేన పార్టీ నాయకుల( Janasena Leaders ) సహాయం కోరడం కోసం వెళ్లారు.

Telugu Duvvuru, Janasena, Nellore, Pawan Kalyan, Sand Mafia, Ycp, Ycp Sand Mafia

స్థానికులకు అండగా నిలబడ్డ జనసేన నాయకుడు శ్రీధర్( Sridhar ) తన అనుచరులతో మరియు జనసేన కార్యకర్తలతో కలిసి అక్రమంగా తరలిస్తున్న ఇసుకని ఆపే ప్రయత్నం చేసారు.దీనికి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులూ( YCP Leaders ) తన బలగం తో కలిసి జనసేన నాయకుల మీద మూకుమ్మడి గా దాడికి దిగారు.రెండు పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఆ తర్వాత జనసేన నాయకులూ స్థానికంగా ఉన్న పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేసారు.

నిందితులను శిక్షించాల్సిందిగా కోరారు.

Telugu Duvvuru, Janasena, Nellore, Pawan Kalyan, Sand Mafia, Ycp, Ycp Sand Mafia

అయితే జనసేన నాయకులూ ఇచ్చిన ఫిర్యాదుని కంప్లైంట్ లో పోలీసులు రిజిస్టర్ చెయ్యలేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.స్థానిక ఎమ్యెల్యే పోలీసులను బాగా మ్యానేజ్ చేసాడని, అందుకే పోలీసులు కేసులు నమోదు చెయ్యలేదని అంటున్నారు.ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దాకా తీసుకెళ్లి, ఆయన ఇక్కడికి వచ్చేలా చేస్తామని, దువ్వూరు లో మా కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు అక్రమ ఇసుక రవాణా జరగనివ్వబోమని జనసేన పార్టీ నాయకులూ శ్రీధర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube