తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సినిమాలు ఒకే కాన్సెప్ట్ తో వచ్చాయి ఆ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…ఇండస్ట్రీ లో ఒక సినిమా ఒకరు చేస్తున్నారు అంటే అలాంటి సినిమాలు చాలానే ఇండస్ట్రీ లో వస్తు ఉంటాయి అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు ఒకే కాన్సెప్ట్ తో వచ్చి ఇండస్ట్రీ లో హిట్ అయినవి ఉన్నాయి, ప్లాప్ అయినవి ఉన్నాయి అవేం సినిమాలు అంటే అంటే సుందరినికి,( Ante Sundaraniki ) కృష్ణ వ్రింద విహారి( Krishna Vrinda Vihari ) సినిమాలు రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే కాన్సెప్ట్ తో వచ్చాయి
అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి అనే చెప్పాలి.ఇక ఈ రెండు సినిమాలు అనుకోకుండా తక్కువ రోజుల గ్యాప్ లోనే రావడం రెండు సినిమాలు ప్లాప్ అవ్వడం జరిగింది…ఇక ఇప్పుడు అవే కాకుండా గతంలో కూడా చాలా సినిమాలు ఒకే కథ తో వచ్చాయి అయితే బాలయ్య, వెంకటేష్ నటించిన ధ్రువ నక్షేత్రం,( Dhruva Nakshetram ) అశోక చక్రవర్తి( Ashoka Chakravarthy ) సినిమాలు రెండు కూడా ఒకే కథ తో రావడమే కాకుండా రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.
ఇక రెండు సినిమాలు యావరేజ్ టాక్ ని సంపాదించుకోవడం జరిగింది.అలా అనుకోకుండా అప్పుడప్పుడు రెండు సినిమాల స్టోరీ లు సేమ్ ఉంటూ సినిమాలు రావడం మనం ఇప్పటికే చాలా సార్లు చూసాం…అలాగే నాగార్జున హీరో గా దశరధ్ డైరెక్షన్ లో వచ్చిన గ్రీకు వీరుడు సినిమా( Greeku Veerudu Movie ) అశోక్ డైరెక్షన్ లో ఆది హీరో గా వచ్చిన సుకుమారుడు సినిమా( Sukumarudu Movie ) రెండు కూడా సేమ్ కాన్సెప్ట్ తో వచ్చాయి ఇవి కూడా ఒక వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి అందుకే ఒక సినిమా కి సంభందించిన థాట్ ఇద్దరికీ రావడం సహజంగా జరుగుతూనే ఉంటాయి…