వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి కష్టమైన పనైనా చేయగలమని ఎంతోమంది వృద్ధులు నిరూపించారు.పీహెచ్‌డీలు అవసరం లేకుండానే సొంత ఆవిష్కరణలు చేయగలమని చదువుకోని వారు కూడా ప్రూవ్ చేశారు.
తమ అవసరాలను తామే సొంతంగా తీర్చుకునేందుకు వీరు కొత్త సొల్యూషన్స్ కనిపెట్టి అందరికీ స్పూర్తిగా నిలిచారు.ఆ జాబితాలో తాజాగా తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, దుబ్బాక మండలం, హబ్బీపూర్ గ్రామస్థుడు చేరాడు.
ఇతని పేరు పబ్బం చంద్రం, వయసు 60 ఏళ్లు.చంద్రం కురుకురే, బింగో లాంటి స్నాక్స్ గ్రామాల్లోని కిరాణా షాపులకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు.వాటిపై వచ్చిన చాలీచాలని డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అతను ఊర్లలో తిరగడానికి సైకిల్( Bicycle ) పై ప్రయాణిస్తాడు.గత 30 ఏళ్లుగా సైకిల్‌పై తినుబండారాలు విక్రయిస్తున్న ఆయన ఇప్పుడు వయస్సు, కుటుంబం పెరగడం వల్ల అలా చేయడం కష్టంగా మారింది.చంద్రం ఈ పనిని సులభతరం చేసేందుకు తన సైకిల్‌ను బ్యాటరీతో నడిచే మోటార్‌సైకిల్‌గా మార్చాలనుకున్నాడు.
చంద్రం తన సైకిల్‌ను బ్యాటరీతో నడిచే మోటార్‌సైకిల్‌గా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు.ఇది నీవల్ల ఏమవుతుంది, అసలు నీకేం తెలుసు అని దాన్ని బ్యాటరీ మోటార్‌సైకిల్‌గా మారుస్తావంటూ నిరుత్సాహపరిచారు.అతని ప్రయత్నాలు చూసి చాలామంది నవ్వారు కూడా.కానీ అదేమీ పట్టించుకోకుండా తన గోల్ సాధించేందుకు చంద్రం పట్టుదలతో ముందుకు సాగాడు.చివరికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్లు ప్రయాణించగలిగే మోటార్‌సైకిల్( తయారు చేసి అందరి నోళ్లు మూయించాడు.దీనిని తయారు చేసేందుకు 22,000 రూపాయలు వెచ్చించాడు.
చంద్రం ఇప్పుడు మోటారు సైకిల్‌పై ఊరూరు తిరుగుతూ జీవనోపాధి పొందుతున్నాడు.మనసు పెడితే ఎవరైనా ఏదైనా సాధించగలరని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటున్నట్లు తాత అని చెప్పి ఆశ్చర్యపరిచారు.