పారిజాత పుష్పాలను( Parijatha Flowers ) దేవతా పుష్పాలు అని కూడా అంటారు.పారిజాతం చెట్టు కు దేవత వృక్షం అని కూడా పేరు ఉంది.
శ్రీకృష్ణుడికి( Sri Krishna ) నారదుడు నీకు ఇష్టమైన వారికి ఈ పుష్పాన్ని ఇవ్వమని ఒక పుష్పాన్ని ఇస్తాడు.అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణి వద్దే ఉండడంతో రుక్మిణికే ఆ పారిజాత పుష్పాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఆ తర్వాత శ్రీకృష్ణుడికి అతి ప్రియమైన భార్య సత్యభామ అలగడం లాంటి ఎన్నో జ్ఞాపకాలు పారిజాత పుష్పం పేరు వినగానే గుర్తుకు వస్తాయి.పారిజాతంతో పాటు మందారం, సంతాన వృక్షం, కల్ప వృక్షం, హరి చందనం వీటిని దేవతా వృక్షాలని పిలుస్తారు.

వీటికి మాలిన్యం ఉండదు.లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం నుంచి జన్మించిన పారిజాతం ఎంతో శ్రేష్టమైనది.సత్యభామ( Satyabhama ) కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి ఇంద్రుని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ కథలు ఉన్నాయి.పారిజాత పువ్వుల్ని చూస్తే అలా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
వాటి అందం అలాంటిది మరి.తెల్లని పువ్వు మధ్యలో నారింజ రంగు రంగరించి పోసినట్లు ఉండే పారిజాతాలను దోషం అంటని పుష్పాలు అని అంటారు.అందుకే సాధారణ పుష్పాలు పూజకు కోసే సమయంలో కింద పడితే ఆ పువ్వుల్ని పూజకు ఉపయోగించకూడదు.కానీ పారిజాతాలకు అటువంటి దోషాలు ఏమీ ఉండవు.

లక్ష్మీదేవికి( Lakshmidevi ) ఎంతో ఇష్టమైన పారిజాత పుష్పాలు కిందపడిన పూజ చేయడానికి ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు.రాత్రి సమయంలో పూసి సువాసనల్ని వెదజల్లే ఈ పువ్వుల చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఇంత గొప్పదనం కలిగిన పారిజాతాలు రాత్రి సమయంలోనే పూస్తాయి.ఉదయానికల్లా రాలిపోతాయి.అందుకే రాత్రి పూసి ఉదయానికే రాలిపోయిన పూజకు ఉపయోగించవచ్చు.వీటికి దోషం ఉండదు.
చెట్టు కింద రాలిన వాటి అందం వాటి సువాసన మాత్రం అస్సలు తగ్గదు అని పండితులు చెబుతున్నారు.