గర్ల్‌ఫ్రెండ్‌కు ఏకంగా 11 రూల్స్ పెట్టిన బాయ్‌ఫ్రెండ్‌.. చివరికి ఎలాంటి షాక్ తగిలిదంటే..!

మనుషుల మధ్య బంధం నిలబడాలంటే ముఖ్యంగా నమ్మకం ఉండాలి.ఇక ప్రేమ, పెళ్లి బంధాలలో నమ్మకం లేకపోతే ఆ బంధాలు పుటుక్కున తెగిపోతాయి.

 Boyfriend Who Put 11 Rules Together For Girlfriend .. What A Shock In The End ..-TeluguStop.com

మనసులో సవాలక్ష అనుమానాలు పెట్టుకొని నువ్వు ఇలానే ఉండాలి.అలా చేయొద్దు.

ఇలా చేయొద్దు.అని 100 షరతులు పెడితే ఎవరైనా సరే ఆ బంధం నుంచి బయట పడాలనే అనుకుంటారు.

తాజాగా కూడా ఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్నటువంటి ప్రేమ బంధం నుంచి బయట పడడానికి సిద్ధమైంది.సదరు బాయ్‌ఫ్రెండ్‌ దిక్కుమాలిన రూల్స్ పెట్టడమే ఇందుకు కారణం.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలోనూ పంచుకుంది.తనకు అర్థం పర్థం లేని రూల్స్ పెట్టాడంటూ ఓ స్క్రీన్‌షాట్‌ షేర్ చేసిందీ ప్రియురాలు.

అలాంటి వ్యక్తితో ఎలా ప్రేమబంధం కొనసాగించాలంటూ ఫైర్ అయ్యింది.ఇలాంటి బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్ కొనసాగించడం కంటే దాన్ని తెంచుకుంటేనే మేలు అని అభిప్రాయపడింది.

ఈ రూల్స్ గురించి తెలుసుకున్న నెటిజన్లు సైతం ఆ బాయ్‌ఫ్రెండ్‌ని ఏకిపారేస్తున్నారు.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో .బాయ్‌ఫ్రెండ్‌ పెట్టిన రూల్స్ ఏంటో తెలుసుకుంటే అమెరికా యూనివర్శిటీలో కరోలిన్‌ అనే యువతి విద్యనభ్యసిస్తోంది.ఆమెకొక బాయ్‌ఫ్రెండ్‌ కూడా ఉన్నాడు.

వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొంతకాలం బాగానే సాగిందికానీ అకస్మాత్తుగా ఏమైందో తెలీదు గానీ సదరు బాయ్‌ఫ్రెండ్ తాను చెప్పే‌ 11 రూల్స్ తప్పకుండా పాటించాలని కరోలిన్‌ని హెచ్చరించాడు.తనతో తప్ప ఒంటరిగా లేదా ఇతరులతో బయట తిరగకూడదు, తినకూడదు, టైట్ డ్రెస్సులు వేసుకోకూడదు, ఆల్కహాల్‌ తాగకూడదు, ఇతర అబ్బాయితో మాట్లాడకూడదు, ఎవరినీ కలవకూడదు, తన ఉంగరాన్ని ఎప్పటికీ తీసివేయకూడదు, క్రాప్ టాప్, టైట్ డ్రెస్ ధరించకూడదు, తనకు ఇష్టంలేని పార్టీలకు వెళ్లకూడదంటూ ఇలా 11 రూల్స్ కరోలిన్ కు పెట్టాడు.

Telugu Shockingrules, Boy Friend, Friend, Latest-Latest News - Telugu

ఈ చాంతాడంత రూల్స్ లిస్టును కరోలిన్ ఫోన్ కి మెసేజ్ రూపంలో పంపాడు.ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా షాకయిన సదరు ప్రియురాలు వీడేంటి ఇన్ని రూల్స్ పెట్టాడు వెధవా అంటూ తిట్టిపోసింది.ఈ నియమాలు పాటించడానికి నేనేమైనా బానిసనా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.ఓ స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేసి ఇలాంటి అనుమానపు పక్షితో నా ప్రేమ బంధం తెంచుకోబోతున్నానని తెలిపింది.

దాంతో నెటిజనులు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.ఆడదంటే ఆడబొమ్మ ఏం కాదు.

ఏ అమ్మాయి అయినా సరే ఇలాంటి రూల్స్ పెట్టే మగవాడికి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube