భారీ వివాదంలో చిక్కుకున్న జొమాటో.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు.. అందుకేనా?

సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో ఏదైనా కంపెనీ చిన్న తప్పు చేసినా బలైపోవడం ఖాయంగా మారింది.కంపెనీల కారణంగా తమకు జరిగిన చేదు అనుభవాల గురించి నెటిజన్లు ఎప్పటికప్పుడు నెట్టింట పంచుకుంటున్నారు.

 Zomato Caught In Huge Controversy Over Hindi Tamil Language Issue, Zomato, Food-TeluguStop.com

దీనివల్ల తప్పుచేసిన కంపెనీలు వివాదాల్లో పడుతూ విమర్శల పాలవుతున్నాయి.తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా ఓ వివాదంలో చిక్కుకుంది.

కంపెనీ కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌ చేసిన ఓ తప్పు అనేక విమర్శలకు దారి తీస్తోంది.ప్రస్తుతం ట్విటర్ లో ‘#Reject_Zomato’ పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్‌ అవుతోంది.

జొమాటోలో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయకూడదంటూ నెటిజన్లు ఆ కంపెనీపై దుమ్మెత్తిపోస్తున్నారు.మరి జొమాటో నెటిజన్లకు ఆగ్రహం తెప్పించేంత తప్పేం చేసింది? తెలుసుకుందాం.

ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి చెందిన వికాస్‌ అనే ఓ వ్యక్తి జొమాటోలో చికెన్ రైస్, పెప్పర్ చికెన్ ఆర్డర్ చేశాడు.ఈ రెండు ఐటమ్స్‌కు జొమాటో డబ్బులు వసూలు చేసింది.

కానీ అతడికి జొమాటో డెలివరీ బాయ్ అందించిన పార్సిల్ లో పెప్పర్ చికెన్ మిస్సయింది.దీంతో వికాస్ ఈ విషయాన్ని కస్టమర్‌కేర్‌కు తెలియజేస్తూ.

పెప్పర్ చికెన్ కోసం వసూలు చేసిన డబ్బు రీఫండ్ చేయాలని కోరాడు.

వికాస్ ఇచ్చిన కంప్లైంట్ ను ఓ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ టేకప్ చేశాడు.

Telugu Rejectzomato, Care Executive, Delivery, Hinditamil, Latest, Netizens, Zom

కొంత సమయం తర్వాత పార్సిల్ ప్యాక్ చేసిన సదరు రెస్టారెంట్‌కు కాల్ చేశానని.కానీ భాషా పరమైన ఇబ్బందుల వల్ల సరైన సమాచారం తెలుసుకోలేకపోతున్నానని కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌ సెలవిచ్చాడు.దీంతో తమిళనాడులో జొమాటో సేవలు ఉన్నప్పుడు.తమిళ్ అర్థం చేసుకోగల వ్యక్తిని నియమించుకోవాలని వికాస్‌ సలహా ఇచ్చాడు.దీనికి “హిందీ మన జాతీయ భాష అని మీకు తెలీదు అనుకుంటా.హిందీ జాతీయ భాష కాబట్టి దానిని అందరూ కాస్తో కూస్తో నేర్చుకోవాలి కదా” అని కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌ బదులిచ్చాడు.

Telugu Rejectzomato, Care Executive, Delivery, Hinditamil, Latest, Netizens, Zom

దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమర్‌ జొమాటోను ట్విట్టర్ వేదికగా కడిగి పారేశాడు.“హిందీ మన జాతీయ భాష అంట.అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంట.హిందీ రాకపోతే డబ్బులు రీఫండ్ చేయడం కుదరదట.

పైగా నేను అబద్దాలు ఆడుతున్నానని కస్టమర్ కేర్ అంటున్నాడు.అసలు కస్టమర్లతో ప్రవర్తించే తీరు ఇదేనా?” అని వికాస్ మండిపడ్డాడు.అంతేకాదు జొమాటో యాప్‌ను తమిళ ప్రజలందరూ డిలీట్ చేయాలని కోరాడు.దీంతో ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది.

ఇది గమనించిన జొమాటో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

Telugu Rejectzomato, Care Executive, Delivery, Hinditamil, Latest, Netizens, Zom

కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌ మాట్లాడింది తప్పేనని.ఇందుకు అతడి కాంట్రాక్టు రద్దు చేశామని.దయచేసి మీ నెంబర్ షేర్ చేయండి అని వికాస్ కి విజ్ఞప్తి చేసింది.

ఈ క్రమంలో జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ఓ సమర్థత ఇచ్చుకున్నారు.సదరు కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అనుభవం లేని యువకుడు అని.అతడు తెలిసో తెలియకో చేసిన తప్పు కారణంగా జాతీయస్థాయిలో అసహనం వ్యక్తం చేయడం సరికాదన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube