దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణనే బీజేపీ టార్గెట్..

దక్షిణాదిలో తెలంగాణా పై గురి పెట్టిన బీజేపీ ఆ దిశగా వ్యూహ రచన చేస్తోంది.ఇక్కడి నేతలను, కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది.

 Bjp Is Targeting Telangana In Southern States , Southern States , Bjp Is Targeti-TeluguStop.com

జులై మూడున జరిగే బహిరంగ సభ వేదికపైనే సమరభేరి మోగించి వచ్చే ఎన్నికలకు సమాయత్తం కానుంది.

తెలంగాణ పై దృష్టి సారించిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తుంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణా లో అధికార పగ్గాలు పట్టాలని వ్యూహరచన చేస్తున్నది.ఈ నేపథ్యంలోనే అగ్రనాయకులు తరచుగా తెలంగాణ కు వస్తున్నారు.

సమావేశాలు … సభలు .బహిరంగ సభలు పెట్టి నేతలను , కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.

నేతల్లో కార్యకర్తల్లో అదే జోష్ ను కొనసాగించడానికి ఈ సారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను వేదికగా నిర్ణయించింది. 

జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలను హైటెక్స్‌లోని నోవోటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్నారు.

జూలై 3న సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని నిర్ణయించారు.బహిరంగ సభ కోసం వేదికను ఎంపిక చేయడంపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే దృష్టి సారించారు.

ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

దీంతో  హైదరాబాద్ సభను పార్టీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.10 లక్షలకు తక్కువ కాకుండా జన సమీకరణ చేయాలన్న లక్ష్యంతో కసరత్తు ప్రారంభించారు.అందుకు బూతులవారీగా పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ఒక్కో బూతు నుంచి 40మందికి తక్కువ కాకుండా తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు.ఈ క్రమంలో 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మిషన్ మోడ్ తో పని చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టుగా భావిస్తున్నారు.

Telugu Bjp Telangana, Bjptelangana, Bjpnational, Cm Kcr, Hyderabad, Novotel Hite

ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నే బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. తెలంగాణ విషయంలో బీజేపీకి పలు సానుకూలాంశాలుండటమే అందుకు కారణం.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మొదటగా చొరవ చూపిన జాతీయ పార్టీ బీజేపీనే కావడం ఓ ప్రధాన సానుకూలాంశం.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలత ప్రకటిస్తూ 1997లోనే కాకినాడలో జరిగిన సమావేశంలో బీజేపీ తీర్మానం చేసింది.

 ఆ తీర్మానం ద్వారా తెలంగాణ సమాజానికి బీజేపీ ఎంతో దగ్గరైంది.తెలంగాణ ప్రజల మనసును గెలుచుకున్న మొదటి జాతీయ పార్టీ బీజేపీనే అంటే అతిశయోక్తి కాదు.

Telugu Bjp Telangana, Bjptelangana, Bjpnational, Cm Kcr, Hyderabad, Novotel Hite

2014లో తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టినపుడు కూడా బీజేపీ మాటకు కట్టుబడి మద్దతు పలికింది.ఫలితంగా తెలంగాణ ఏర్పాటు సులభమైంది. తెలంగాణలో సీఎం, టీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.కే సీఆర్ రెండోసారి అధికారం చేపట్టి మూడున్నరేళ్లు గడిచిపోయాయి.2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలపడింది.దీనికి తోడు సర్కార్ అప్పులు పెరిగిపోయాయి.

అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.వీటిని జనంలోకి తీసుకెళితే బీజేపీ సానుకూలత పెరుగుతుందని… అధికార పగ్గాలు చేపట్టవచ్చని భావిస్తున్నారు.

రాబోయే రోజుల్లో జనంలోకి వెళ్ళడానికి మరిన్ని కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube