ఆ షోలో రోజాకు ఘోర అవమానం.. ఏడుస్తూ షో నుంచి బయటకు వెళ్లేలా?

ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత రోజుల్లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిగా వ్యవహరించి పాపులారిటీని పెంచుకున్నారు.తాను ఎమ్మెల్యే కావడానికి, ఇప్పుడు మంత్రి కావడానికి ఒక విధంగా జబర్దస్త్ షో కారణమని రోజా భావిస్తారు.

 Jabardasth Comedians Insulted Heroine Roja Details, Jabardasth Comedians, Insult-TeluguStop.com

మంత్రి కావడం వల్ల ఈ షోలకు దూరమైన రోజా ఈటీవీలో దసరా పండుగ కానుకగా ప్రసారం కానున్న దసరా వైభవం షోకు గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ ఈవెంట్ కు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించడం గమనార్హం.

 Jabardasth Comedians Insulted Heroine Roja Details, Jabardasth Comedians, Insult-TeluguStop.com

ఆది రోజాతో మీరు హీరోయిన్ అయ్యారని జడ్జి అయ్యారని ఎమ్మెల్యే అయ్యారని మంత్రి అయ్యారని మీలా ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలని ఆది అడగగా ఇలా కనిపించిన అమ్మయిల వెనుక తిరగడం మానేయాలి అని రోజా సమాధానం ఇచ్చారు.ఇక్కడ మనోళ్లలో ఎవరెవరికి ఏ శాఖ సెట్ అవుతుందో చెప్పగలరా అని ఆది అడగగా శ్రీముఖికి టూరిజం శాఖ సెట్ అవుతుందని రోజా తెలిపారు.

అన్ని ఛానెళ్లకు శ్రీముఖి టూర్ కొడుతోందని అందువల్లే ఆ శాఖ ఆమెకు కరెక్ట్ అని రోజా చెప్పుకొచ్చారు.నాకు ఏ శాఖ సూట్ అవుతుందని ఆది అడగగా ఆహార భద్రత శాఖ అని రోజా సమాధానం ఇచ్చారు.

ఈ మధ్య నీ ఆకలి గురించి బాగా విన్నానని అందువల్ల నీకు ఆ శాఖ కరెక్ట్ అని రోజా వెల్లడించడం గమనార్హం.శాంతి స్వరూప్ నాకే శాఖ ఇస్తారు అని అడగగా నీకు శాఖ కాదు పాక అంటూ హైపర్ ఆది శాంతి స్వరూప్ పరువు తీసేశారు.

నూకరాజు రోజాతో ఏదో చెప్పగా రోజా ఏం మాట్లాడుతున్నావ్.నన్ను ఈ ఈవెంట్ కు పిలిచింది అవమానించడానికా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.మీరంతా ప్లాన్ చేసుకుని నన్ను రమ్మన్నారా అంటూ ఏడుస్తూ రోజా బయటకు వెళ్లిపోయారు.దసరా పండుగ రోజున ఉదయం 9 గంటలకు ఈ ఈవెంట్ ప్రసారం కానుండగా ఈ ప్రోమోకు మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube