తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈనెల 24వ తేదీన తెలంగాణకు రానున్నారు.పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్ లో ప్రియాంక గాంధీ ప్రచారం చేపట్టనుండగా జుక్కల్, మెదక్, తాండూరు, ఖైరతాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని, అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తామని నేతలు ప్రజలకు వివరించనున్నారు.