దెబ్బకు బీజేపీ యూటర్న్ ?

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ కేస్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu Arrest ) అయిన సంగతి తెలిసిందే.ఈ కేసులో విచారణలో భాగంగా చంద్రబాబు కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు.

 Bjp Uturn For A Blow, Pawan Kalyan , Chandrababu Naidu Arrest , Tdp, Bjp, Daggu-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.ఒక ప్రజానాయకుడిని కక్ష పూరితంగా జైలుకు పొంపిన దుర్మార్గపు చర్య జగనే చెందుతుందని టీడీపీ శ్రేణులు మండిపడుతుంటే.

ఇది సామాన్యుల విజయమని, స్కిల్ స్కామ్ లో మోసపోయిన యువత విజయమ అని వైసీపీ నేతలు చంకలుగుద్దుతున్నారు.ఇలా హాట్ హాట్ గా సాగుతున్న ఏపీ పాలిటిక్స్ లో చంద్రబాబు అరెస్ట్ కావడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

గత కొన్ని రోజులుగా టీడీపీతో పొత్తు కోసం బీజేపీ జనసేన పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Ap, Chandrababu, Pawan Kalyan-Politics

మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాయి.పొత్తుకు సంబంధించి చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా చంద్రబాబు జైలు పాలు అయ్యారు.

దీంతో పొత్తు అంశం డైలమాలో పడింది.కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుంటే బీజేపీ మాత్రం వెనుకడుగు వేస్తోంది.

చంద్రబాబు అరెస్ట్ కు నిరసన తెలుపుతూ నేడు ఏపీలో రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునివ్వగా.ఆ బంద్ కు బీజేపీ ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ( Daggubati Purandeswari )స్పష్టం చేశారు.

Telugu Ap, Chandrababu, Pawan Kalyan-Politics

అయితే టీడీపీ చేపడుతున్న బంద్ కు బీజేపీ మద్దతు ఉందని ఓ లెటర్ మీడియాలో వైరల్ అవుతుండగా.ఆ లెటర్ ఫెక్ అని, టీడీపీ ప్రకటించిన బంద్ కు బీజేపీ( BJP ) ఎలాంటి మద్దతు తెలపడం లేదని చెప్పుకొచ్చారు పురందేశ్వరి.దీంతో టీడీపీ విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.మొదటి నుంచి కూడా టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.అయితే వైసీపీని గద్దె దించాలంటే టీడీపీతో కలవాల్సిన పరిస్థితి ఉండడంతో పొత్తువైపు అడుగులు వేస్తూ వచ్చింది బీజేపీ.ఇక తాజా పరిణామాలతో మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరి ముందు రోజుల్లో బాబు అరెస్ట్ ఇంకెలాంటి పరిణామాలకు తావిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube