మనిషి తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించుకోవడానికి ఈ ధర్మబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాడు.మన సనాతన ధర్మంలో ఏ రూపంలో అయినా భగవంతుణ్ణి( God ) ఆరాధించవచ్చు.
అలాగే ఏ రాశుల వారు ఏ దైవాన్ని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.మేషరాశికి అధిపతి కుజుడు.
ఈ రాశి వారు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం, దుర్గాదేవిని పూజించడం వల్ల వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని, శనివారం( Saturday ) రోజు దుర్గాదేవిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు.
ఇంకా చెప్పాలంటే మిధున రాశికి అధిపతి బుధుడు.ఈ రాశి ప్రజలు ఆరాధించవలసిన దైవము శ్రీ మహావిష్ణువు( Shri Mahavishnu.).అలాగే ఈ రాశి వారు బుధవారం నాడు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సింహ రాశికి అధిపతి రవి.ఆదివారం సూఆర్యాష్టకం ఆదిత్య హృదయం వంటివి చదవడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.అంతేకాకుండా కన్య రాశికి అధిపతి బుధుడు.ఈ రాశి ప్రజలు ఆరాధించవలసిన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ).ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
అంతేకాకుండా తుల రాశికి అధిపతి శుక్రుడు.ఈ రాశి వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని( Goddess Lakshmi ) పూజించడం వల్ల వారికి ధనపరమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి.మకర రాశికి అధిపతి శని.ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి.నవగ్రహాలలో శనిని పూజించడం, శనివారం రోజు దక్షిణామూర్తిని, వెంకటేశ్వరుని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మీన రాశికి అధిపతి బృహస్పతి.ఈ రాశి వారు దక్షిణామూర్తిని పూజించడం ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు.
అలాగే గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం ఆ రోజు శనగలను ప్రసాదం చేసి పంచి పెట్టడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని పండితులు( Scholars ) చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU