ప్రముఖ టెక్ సంస్థ గూగుల్( Google ) గురించి జనాలకి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రపంచంలో నాటినుండి నేటికీ రారాజుగా వెలుగొందుతున్న గూగుల్ పైన ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడుతున్న పరిస్తితి.
ఈ క్రమంలోపెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్యతో గూగుల్ వినియోగదారులకోసం వివిధ కొత్త అప్లికేషన్‌లు అభివృద్ధి చేస్తోంది.ఆ విధంగా, ఈ పోస్ట్‌లో మనం రోజువారీ ఉపయోగం కోసం గూగుల్ అభివృద్ధి చేసిన 8 శక్తివంతమైన యప్స్ గురించి తెలుసుకుందాం.

అందులో మొదటిది “గూగుల్ వాయిస్ అసిస్టెంట్”( Google Voice Assistant ) అని చెప్పుకోవాలి.మీ ఫోన్‌ని వాయిస్ ద్వారా యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని ఇది అనుమతిస్తుందనే విషయం మీకు తెలిసినదే.దీనితో, మీరు గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌కి కమాండ్‌లు ఇవ్వడం ద్వారా వివిధ పనులను సులభంగా పూర్తి చేయవచ్చు.ఆ తరువాత మీరు “గూగుల్ యాక్షన్ బ్లాక్ యాప్”( Google Action Block ) గురించి తెలుసుకోవాలి.
మీ రొటీన్ పనులను తేలిగ్గా చేసేందుకు ఇది మీకు వీలు కల్పిస్తుంది.అంటే మీరు ఫోన్‌లో ఫలానా ఆప్షన్‌కి వెళ్లి, అందులో పనిని చేయడానికి బదులు.అదే పనిని హోమ్ స్క్రీన్‌పై ఓ బటన్‌ని క్లిక్ చెయ్యడం ద్వారా చేసుకోవచ్చు.తద్వారా త్వరగా పని ఫినిష్ అయిపోతుంది.

ఈ లిస్టులో 3వది “గూగుల్ ఈ ఫోటో స్కాన్ యాప్”( Google Photo Scan ) ప్రస్తుతం మీ ప్రస్తుత ఫోటోలను హై క్వాలిటీతో స్కాన్ చేయడంలో ఇది మీకు సహకరిస్తుంది.మీరు స్కాన్ చేస్తున్నప్పుడు ఇది ఫోటో సైజును కత్తిరించడం, వంకరగా ఉన్న ఫోటోను స్ట్రెయిట్ చేయడం, ఫోటోను జూమ్ చేయడం వంటి అనేక పనులను సమర్ధవంతంగా చేస్తుంది.అదేవిధంగా “గూగుల్ లెన్స్”( Google Lens ) గురించి తెలుసుకోవాలి.దీనిని వాడుకొని మనం వివిధ వస్తువులపై రాసిన అక్షరాలను స్కాన్ చేయవచ్చు.తద్వారా అలాంటి వస్తువులను గూగుల్ లో శోధించవచ్చు.ఇదే క్రమంలో మీరు “గూగుల్ ఫోన్,” “గూగుల్ ఫైల్” గురించి కూడా తెలుసుకోవడం ఉత్తమం.
గూగుల్ ఫోన్ మనం ప్రదేశాలను వెతకడానికి, ఫోన్‌లోని ఫైల్‌లను సులభంగా నిర్వహించడంలో గూగుల్ ఫైల్‌లు మనకు సహాయపడతాయి.