హిందూ మతంలో లక్ష్మీ దేవత( Goddess Lakshmi )ను సంపదకు ప్రతికగా భావిస్తారు.లక్ష్మీదేవి చల్లని చూపు ఉన్న కుటుంబం సిరి సంపదలతో సంతోషంగా ఉంటుందని విశ్వసిస్తారు.
దాంతో లక్ష్మీదేవి ఆశీస్సులు తమ పై కలకాలం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు.లక్ష్మీదేవి ఆశీస్సులు కలకాలం ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తెల్లవారుజామున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ దేవత తులసి మొక్కలో నివసిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
అందుకే రోజు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి తులసి మొక్క( Tulasi )కు రాగి పాత్రలో నీళ్లు సమర్పించాలి.

ఈ సమయం లో మొక్కకు నీరు సమర్పించేటప్పుడు విష్ణు మంత్రం జపించాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి( Vishnu Murthy ) అనుగ్రహం ఎప్పుడు మీపై ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే శాస్త్రాల ప్రకారం స్నానం చేసిన తర్వాత కలశంలో వెర్మిలిన్, పువ్వులు ఉంచి సూర్య భగవానుడికి సమర్పించాలి.
దీంతో తల్లి లక్ష్మి సంతోషిస్తుంది.దీంతో పాటు మీ ఇంటి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు ఉదయం పూజ చేసిన తర్వాత నుదుటి పై చందన తిలకం( Chandana Tilakam ) రాసుకోవాలి.దీన్ని పవిత్ర గ్రంధాలలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

ఇంకా చెప్పాలంటే చందన తిలకం రాసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.అలాగే మనసు ఏ పనిలోనైనా నిమగ్నమై ఉంటుంది.ఇంకా చెప్పాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ప్రతి రోజు ఉదయం ఇంటినీ శుభ్రపరచేటప్పుడు ఉపయోగించే నీటిలో ఉప్పు( Salt ) వేస్తే అది ప్రతికూలతను తొలగిస్తుంది.లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి పై ఎప్పుడు ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారన్ని ప్రతి రోజు శుభ్రం చేయాలి.చాలా మంది ఇంట్లోనీ పరిసరాలు శుభ్రం చేసి ప్రధాన ద్వారన్ని అలానే వదిలేస్తుంటారు.
అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.