ఒకప్పటి లేడీ స్టార్ కమెడియన్ కల్పనా రాయ్( Kalpana Roy ) గురించి ఈ తరం వారికి అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
దాదాపు 430కి పైగా సినిమాలలో నటించి మెప్పించింది.అయితే సినిమాలలో నటించినంతకాలం స్టార్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆఖరి రోజుల్లో మాత్రం చాలా అవస్తులు పడిందట.
చివరి రోజుల్లో ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడింది.అంత పెద్ద స్టార్ కమెడియన్ కి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1950లో కాకినాడలో జన్మించిన కల్పనా రాయ్ అసలు పేరు సత్యవతి( Satyavati ).యుక్త వయసులో ఆమె ఎంతో అందంగా ఉండేది.ఒంటినిండా బంగారు నగలు వేసుకుని ఆమె నడిచి వస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలేవి కాదట.మొదట నీడలేని ఆడది సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ కల్పన కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల కొద్దీ సినిమాలలో నటించింది.
అందరికీ తానే స్వయంగా అన్నం వండి వడ్డించేది.కో డైరెక్టర్లు ( Co.Directors )సహా ఎంతోమంది ఆమె చేతివంట తిని కడుపు నింపుకునేవాళ్లు.అలాగే ఆమె ఎవరైనా బాధలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు క్షణం ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చేదట.
అంతటి దయామయురాలు కల్పనా రాయ్.
తన దానధర్మాల వల్ల ఉన్న బంగారం, ఆస్తి అంతా కరిగిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు.అప్పు చేసైనా సరే అందరికీ భోజనం పెట్టేది.ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది.
డబ్బు పోగానే అందరూ దూరమయ్యారు.దిగులు వల్ల నో లేక మరింకేదో కానీ కల్పనవిపరీతంగా బరువు పెరిగిపోయింది.
ఈ నటి ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.ఒకమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది.
కానీ ఆమె యుక్తవయసుకురాగానే ఒకరిని ప్రేమించి అతడితో పారిపోయింది.అప్పుడు కల్పన పడ్డ బాధ వర్ణణాతీతం.
ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది.అప్పుడే ఆమె మనిషిగా సగం చనిపోయింది.
ఉన్న డబ్బు కూడా ఆవిరవడంతో పలకరించే నాధుడే కరువయ్యాడు.ఒంటరిగా మిగిలిపోయింది.
చనిపోయేముందు దాదాపు పది రోజులపాటు తిండి లేక ఆకలికి అలమటించింది.తన శరీరం ఆకలికి తట్టుకోలేక హృదయ విదారక స్థితిలో ఆమె కన్నుమూసింది.
కల్పనా రాయ్ చనిపోయినప్పుడు ఆమె చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బుల్లేని దుస్థితికి చేరుకుంది.ఆమె అతి మంచితనం వల్ల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయింది.
ఇంతటి దుస్థితి ఏ ఆర్టిస్టుకూ రాకూడదు.కళామతల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు సాయం చేస్తే కానీ ఆమె అంత్యక్రియలు జరగలేదట.