మన భారతదేశంలో ఉన్న ఎన్నో పురాతన పుణ్యక్షేత్రాలకు, దేవాలయాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు( Devotees ) తరలి వచ్చి భగవంతునికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.అలాగే మరి కొంత మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఉన్న దేవాలయాలకు కొన్ని నిబంధనలు కచ్చితంగా ఉంటాయి.ఆ నిబంధనలను భక్తులు కచ్చితంగా పాటిస్తూ ఉంటారు.
ఆ నిబంధనలను పాటించకపోతే ఆ ప్రముఖ దేవస్థాన అధికారులు నిబంధనలు పాటించని భక్తులపై చర్యలు తీసుకుంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే అన్నవరం( Annavaram ) వెళ్లే భక్తుల కు బిగ్ అలర్ట్.అన్నవరం కొండ పై మంగళవారం నుంచి ప్లాస్టిక్ ను నిషేధించినట్లు దేవాలయాల ముఖ్య అధికారులు వెల్లడించారు.మంగళవారం నుంచి అన్నవరం కొండ పై దుకాణాలలో గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసే సీసాలో మాత్రమే నీటిని విక్రయిస్తున్నారు.
గాజు సీసాలో నీరు( Glass Bottle ) కూలింగ్ ఛార్జీ తో కలిపి 60కి విక్రయిస్తారు.ఇంకా చెప్పాలంటే ఖాళీ బాటిల్ దుకాణంలో తిరిగిస్తే 40 వెనక్కి ఇచ్చేస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే మొక్కజొన్న గింజలతో తయారు చేసిన సీసాలో నీటిని 40 రూపాయలకు విక్రయించేందుకు అనుమతిచ్చాం.
కొండ పై పలు ప్రాంతాలలో జల ప్రసాదం ప్లాంట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.అంతే కాకుండా కొండ పైకి మూత తెరవని సీసాలు మాత్రమే అనుమతి ఇస్తాము అని వెల్లడించారు.వీటిలో తాగునీటిని( Drinking Water ) తీసుకురాకుండా తనిఖీలు చేస్తున్నామని కూడా వెల్లడించారు.
అంతేకాకుండా వివాహాల సమయంలో కూడా ఈ నిబంధనలు అమలులో ఉంటాయని చెబుతున్నారు.ఈ నిబంధనాలను అతిక్రమిస్తే 500 రూపాయలు జరిమానా విధిస్తామని వెల్లడించారు.
ముఖ్యంగా చెప్పాలంటే అన్నవరం కొండ పై ఉన్న సహా సిబ్బంది, ఈఓ అంతా తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామని చెబుతున్నారు.
DEVOTIONAL