ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు దేవాలయాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు భక్తులు తరలి వచ్చి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.
అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు భగవంతునికి తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్ర కీలాద్రి కనక దుర్గమ్మ దేవాలయం( Kanaka Durga Temple )లో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి పై పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.అంతే కాకుండా పవిత్రోత్సవాలలో భాగంగా తెల్లవారు జామున మూడు గంటలకు అమ్మ వారికి స్నపనాభిషేకం, పవిత్ర మాల ధారణ చేస్తారు.
ఆ తర్వాత దుర్గమ్మను భక్తులు దర్శించుకోవడానికి ఉదయం 9 గంటల నుంచి సర్వ దర్శనానికి అనుమతిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ( Vijayawada )లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి అందంగా ముస్తాబు కానుంది.అంతే కాకుండా దుర్గమ్మకు సుప్రభాత సేవ స్నపనాభిషేకాన్ని ఈ నెల 30 తెల్లవారు జామున 3 గంటలకు నిర్వహించనున్నారు.పవిత్రోత్సవాలలో భాగంగా మొదటి రోజున అమ్మవారి దర్శనా( Kanaka Durga )న్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి అనుమతి ఇస్తామని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా మూడో రోజు అయినా సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10:30 కు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిసి పోతాయని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు.అంతేకాకుండా అమ్మవారికి దేవస్థానం అర్చకులు నిత్య కైంకర్యాలు కూడా నిర్వహించనున్నారు.
DEVOTIONAL