Dharmendra : 87 సంవత్సరాల వయస్సులో లిప్ లాక్ సీన్.. ఈ నటుడి కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర( Dharmendra ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాదాపు ఆరు దశాబ్ధాలుగా బాలీవుడ్‌ ( Bollywood )లో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్నారు ధర్మేంద్ర.

 Rocky Aur Rani Kii Prem Kahaani Dharmendra Breaks Silence His Lip Lock Scene-TeluguStop.com

ఇప్పటివరకు దాదాపు 300కు పైగా చిత్రాలు చేశారు.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తున్నారు ధర్మేంద్ర.

ఇప్పటికీ వెండితెరపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని ( Rakhi aur Rani’s Prem Kahani )సినిమాలో నటించాడు.

కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న విడుదల అయిన విషయం తెలిసిందే.

Telugu Aurrani, Bollywood, Dharmendra, Lip Lock Scene-Movie

ఇందులో ధర్మేంద్ర, అలనాటి నటి షబానా అజ్మీ( Actress Shabana Azmi ) ఇద్దరు లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించారు.అయితే మూవీలో ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు.87 ఏళ్ల వయసులో ముద్దు సన్నివేశంలో నటించడమేంట్రా బాబూ అని ఆశ్చర్యపోయారు.కొందరైతే ముసలాడికి దసరా పండగలా ఉంది అంటూ సెటైర్స్ వేస్తారు.ఇంకొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాలో సన్నివేశాలపై మండిపడుతున్నారు.సినిమా అస్సలు బాగోలేదంటూ విమర్శించారు.తాజాగా ఈ సన్నివేశంపై ధర్మేంద్ర స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ.నేను, షబానా కిస్‌ సీన్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసినట్లున్నారు.

సన్నివేశాలను చూసి ప్రేక్షకులు చప్పట్లు కూడా కొట్టారు.

Telugu Aurrani, Bollywood, Dharmendra, Lip Lock Scene-Movie

అస్సలు ప్రేక్షకులు మా నుంచి ఇది అస్సలు ఊహించి ఉండరు.అందుకే దీనికి ఇంతలా రెస్పాన్స్‌ వస్తోంది.నేను ఇంతకుముందు చివరిసారిగా లైఫ్‌ ఇన్‌ ఎ మెట్రో అనే సినిమాలో నఫీసా అలీతో ముద్దు సన్నివేశంలో నటించాను.

అప్పుడు కూడా జనాలు ప్రశంసలు కురిపించారు.ఈ సినిమాలో మా ముద్దు సన్నివేశం గురించి డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ మాకు ముందే చెప్పాడు.

అప్పుడు నేనేమీ అంత సర్‌ప్రైజ్‌ అవలేదు.ఈ సినిమాకు అది అవసరం అనిపించింది.

అందుకే నేను చేస్తానని చెప్పాను.అయినా రొమాన్స్‌కు వయసుతో పనేంటి? వయసు అనేది కేవలం నెంబర్స్‌ మాత్రమే సూచిస్తాయి.ఏ వయసు వాళ్లైనా ఇద్దరి మధ్య ప్రేమను ముద్దు ద్వారానే బయటపెడతారు.ఈ సీన్‌లో నటించేటప్పుడు నేను, షబానా ఏమాత్రం ఇబ్బందిగా ఫీలవలేదు అని చెప్పుకొచ్చాడు ధర్మేంద్ర.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube