ఏదైనా ఊర్లోని మనుషులకు వివిధ పేర్లు( Names ) కచ్చితంగా ఉంటాయి.ఒకటే పేరు ఇద్దరు ముగ్గురికి ఉండడం తక్కువగా చూస్తూ ఉంటాం.
అయితే కోడేరు మండలం జనుంపల్లి లో( Janumpalli Village ) మాత్రం అందుకు విరుద్ధం అని స్థానికులు చెబుతున్నారు.ఆ పల్లెలో అందరి పేర్లు గ్రామ దేవత నామకరణంతో ఉంటాయి.“మా” అక్షరం వచ్చేలా ఇంటికో మంత్రాలమ్మ, మంత్రాలయ్యా ఉంటారు.93 మంది పురుషులకు మంత్రాలయ్య, మంతయ్య, పెద్దమంతయ్య, నడిపి మంతయ్య, 135 మంది మహిళల పేర్లు మంత్రాలమ్మ, మంత్రమ్మ, చిన్నమంతమ్మ, పెద్దమంతమ్మ, నడిపి మంతమ్మ వీరే కాకుండా ఇంకా 18 సంవత్సరాల లోపు బాల బాలికలు సుమారు 50 మందికి ఇలాంటి పేర్లు ఉన్నాయి.
గ్రామ దేవత మంత్రాలమ్మ పై( Mantralamma ) ఉన్న భక్తి విశ్వాసంతోనే ఇక్కడి వారికి తల్లిదండ్రులు అమ్మవారి పేరు వచ్చేలా నామకరణం చేస్తున్నారు.కొన్ని సంవత్సరాలుగా ఇదే ఆనవాయితీ సాగుతుందని స్థానికులు చెబుతున్నారు.కోరిన కోరికలు తీర్చే గ్రామ దేవతగా విరజిల్లుతూ ఉన్న మంత్రాలమ్మ మహత్యం అంతా ఇంతా కాదు.ఆ గ్రామంలో దేవత పేరుపై నామకరణం చేయడం కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు “మా” అన్న అక్షరంతోనే పేరు పెట్టుకోవడం అక్కడి ప్రజలు ఆచారంగా భావిస్తున్నారు.
ఇంటి ఇలవేల్పుగా భావించే గ్రామ దేవత మంత్రాలమ్మ పేరు మీద మంత్రాలయ్య, మంతమ్మ అన్న పేర్లు దాదాపు ప్రతి ఇంటిలో కచ్చితంగా ఒకరు పెట్టుకుంటారు.గ్రామ దేవత పై ( Goddess ) ఉన్న భక్తితో ఆ గ్రామంలోని ప్రజలు ఇలా పేర్లు పెట్టుకుంటున్నారు.ఇంకా చెప్పాలంటే ఆ ఊర్లో కొందరి ఇళ్లలో పుట్టిన చాలా మంది పిల్లలు చనిపోతున్న సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రాలమ్మ దేవత పేరు పెట్టారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం జనుంపల్లి గ్రామంలో వెలసిన మంత్రాలమ్మ దేవతకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి మాసాలలో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.
DEVOTIONAL