వంగలపూడి అనిత తన పై సోషల్ మీడియాలో వచ్చిన కథనాల పై ఫిర్యాదు చేశారు.

నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రావు( Narayana Rao ) కి ఈ పిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయాలని కోరారు.తెదేపా నాయకులు ,కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన అనిత( Anitha ) మీడియా తో మాట్లాడారు.

 Vangalapudi Anita Has Complained About The Articles On Social Media , Vangalapud-TeluguStop.com

తనపై లేని పోని పోస్టులను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వై.ఎస్.భారతి రెడ్డి పి.ఏ వర్రా రవీంద్ర రెడ్డి పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో పిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు.వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెదేపా చేస్తున్న విమర్శలకు సమాధానం లు చెప్పలేక పేటియం బ్యాచ్ హెడ్ గా సజ్జల భార్గవ రెడ్డి ద్వారా పేటియం బ్యాచ్ తో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు.వై.సి.పి వారిలా తెదేపా నాయకులు , కార్యకర్తలు డబ్బు ఆశించరని తెలిపారు.పచ్చ కామెర్లు వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఈ వై.సి.పి వారు తాము చేస్తున్న తప్పులు అందరూ చేస్తున్నారని అనుకోవడం విడ్డురంగా ఉందన్నారు.మా ఇమేజ్ తగ్గించటానికి పేటియం బ్యాచ్ చేస్తున్న విమర్శలను ఖండించడానికి వాసిరెడ్డి పద్మ కు కానీ ,హో మినిష్టర్ వనిత కు గాని నోరు రావడం లేదని ఎద్దేవాచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube