ఎక్కడైనా కరెంట్ షాక్ కొడుతోంది గాని బిల్ షాక్ కొడుతుందా అనుకుంటున్నారా ? ఆ నిజమే అంటున్నాడు గోకులపాడు( Gokulapadu ) గ్రామ వాసి గుడాల రాజబాబు.దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్.రాయవరం మండలం గోకులపాడు గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు రాజబాబు.వృత్తి ఆటో డ్రైవర్ తనకు ఉండటానికి కూడా సరైన ఇల్లు లేదు.ఓ పూరి గుడిసె లో నివాసం ఉంటున్నారు.ఆ పూరి గుడిసె కు 100 కాదు 1000 కాదు లక్షల్లో బిల్ వచ్చింది.దీంతో ఆ కుటుంబం షాక్ కి గురైంది.
ఆ పూరి గుడిసె కు వచ్చిన బిల్ ఎంతో తెలిస్తే మీరు కూడా ఆశ్యర్యా నికి గురవుతారు.ఆ బిల్ ఎంత అంటే అక్షరాల 3 లక్షల 31 వేయి 9 వందల రూపాయలు బిల్ వచ్చింది.
రాజబాబు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ కావడంతో ఆ బిల్ ఎలా కట్టాలంటూ లబోదిబోమంటున్నారు.బాధితుడు గుడాల రాజబాబు మీడియా తో మాట్లాడుతూ మా ఇంటికి ఎప్పుడూ 100 లేదా 200 రూపాయల లోపు కరెంట్ బిల్ వచ్చేదని ఇప్పుడు ఏకంగా 3 లక్షల పైన బిల్ రావడం ఆందోళన గురి చేస్తుందని తెలిపారు.
విద్యుత్ శాఖ అధికారుల కు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పెద్ద పెద్ద కంపెనీలకు వచ్చే బిల్లులు మా పూరి పాక కు రావడం ఏంటో అర్థం కావడం లేదని అన్నారు.
విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి నాకు ఇచ్చిన కరెంట్ బిల్ ను ఉప సంహరించుకొని నాకు గతంలో వచ్చే బిల్ మాదిరిగా బిల్ ఇచ్చి నాకు న్యాయం చేయాలని కోరారు.