పవన్ కళ్యాణ్ ప్రసంగాలు 2014 నుండి ఓకే రకంగా సాగుతుంది పవన్ కళ్యాణ్ 2019 లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానివ్వను అన్నాడు ఏమి జరిగింది.అభిమానులను, ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారు.
ముద్రగడ్డ పద్మనాభం వైసిపి లోకి వస్తానంటే తప్పక ఆహ్వనిస్తాము డ్రగ్స్ మన రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా 30 కోట్ల మంది డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యారు.పోలీసింగ్ ఎక్కువగా జరగడం వలనే మన రాష్ట్రంలో గంజాయి కేసులో ఎక్కువగా కనపడుతున్నాయి.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు రాబోవు రోజుల్లో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.కాకినాడ లో సహకార బ్యాంకులు దివాళా తీయించి బ్యాంకుల ముసుగులో వైసిపి నాయకులే ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు అనే విమర్శలపై మీసమాధానం ఏమిటి అనే ప్రశ్నకు నాకు దానిపై అవగాహన లేదని చెప్పిన మిదున్ రెడ్డి కాపు ఎమ్మెల్యేలపై మాట్లాడితే ప్రజలు తిరగబడితారనే పవన్ కళ్యాణ్ ద్వారంపూడి పై ఆరోపణలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదు.టిడిపి స్క్రిప్ట్ నే పవన్ కళ్యాణ్ చదువుతాడు.
పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్లో పలుకుబడి పెంచుకున్న వారికే ఎమ్మెల్యే టికెట్లు అని ముఖ్యమంత్రి చెప్పారు.గడప గడపకు కార్యక్రమం చేస్తున్నవారే మా అభ్యర్థులు.
జనసేన ఎన్నిస్ధానాల్లో పోటీ చేస్తుందో వారికే క్లారిటీ లేదు.ఇక వైసిపిని ఎక్కడ అడ్డుకుంటారు.
జనసేన కు 15 సీట్లకు మించి ఇచ్చేది లేదని టిడిపి అంటుంది.MLC అనంతబాబు బహిరంగ సభ, క్రిమినల్ కేసుకు సంబంధించి విలేకరుర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సస్పెన్స్ న్ లో ఉన్నారు కదా రాజకీయాల్లో ఇటువంటివి సాధారణమే అంటూ సమాధానం దాటవేసిన మిదున్ రెడ్డి