జ్యోతిష్య శాస్త్రంలో( astrology ) కేతు గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.ప్రజలను పీడించే దుష్ట గ్రహం ప్రసిద్ధిగాంచిన కేతువు ప్రస్తుతం తుల రాశిలో సంచరిస్తున్నాడు.
అయితే అక్టోబర్ 30వ తేదీన కన్యరాశిలోకి కేతువు ప్రవేశిస్తాడు.జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితి కదలికలు మానవ జీవితంపై కొన్ని మార్పులను తీసుకొస్తాయి.
ఈ నేపథ్యంలోనే కేతు గ్రహం కన్య రాశి సంచారం రాశి చక్రంలో కొన్ని రాశులపై అదృష్టంగా మారింది.ఈ సమయంలో కొన్ని రాశుల వారికి జీవితం అద్వితీయంగా మారబోతుంది.
ఈ రాశి వారు ధన ప్రవాహాన్ని చూడబోతున్నారు.అయితే కేతు గ్రహం ఏ ఏ రాశులకు అదృష్ట దేవతగా మారబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహరాశి: కన్య రాశిలో కేతు గ్రహ సంచారం సింహ రాశి( Leo ) వారికి కలిసి వస్తుంది.ఈ సమయంలో వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
అలాగే నలుగురిలో వీరి కష్టానికి గుర్తింపు లభిస్తుంది.దీంతో తగిన ఫలితాలను అందుకోగలుగుతారు.
ధనస్సు రాశి: కేతువు గ్రహం కన్యా రాశిలోకి ప్రవేశించడం వలన ధనస్సు రాశి( Sagittarius ) వారికి జాతక చక్రం అన్ని విషయాల్లోనూ కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి.ఇక ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు, ఉద్యోగులకు కాలం అందివచ్చే విధంగా ఉంటుంది.అంతేకాకుండా వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి.ఇక ఈ రాశి వారిలో ఉన్న రైతులు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు.
వృషభ రాశి: కేతు గ్రహం కన్యా రాశిలో ప్రవేశించడం వలన వృషభ రాశి( Taurus ) జాతకులకు ఈ సమయం సానుకూలంగా మారనుంది.ఆ సమయంలో వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.అలాగే దీని జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారు.