టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) ఒకరు కాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసి ట్వీట్లు హాట్ టాపిక్ కావడంతో పాటు తెగ వైరల్ అవుతుంటాయి.తాజాగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి వర్మ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
పవన్ వ్యవహార శైలి గురించి ఆర్జీవీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం.
తను అనుకున్న దానిని ఎవరు వ్యతిరేకించినా అధికారంలోకి వచ్చిన తర్వాత పీక పిసికేసి చంపేస్తానని బట్టలూడదీసి పరిగెత్తిస్తానని చర్మం ఒలిచేస్తానని హింసాత్మక బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఎవరూ అని ఉండరని వర్మ అన్నారు.
పీకే( PK ) గురించి ప్రస్తావిస్తూ వర్మ ఈ కామెంట్లు చేశారు.హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదని వర్మ చెప్పుకొచ్చారు.

అధికారంలో వస్తే నరికేస్తానని చెబితే అధికారంలో ఉన్నవాళ్లు అదే పని చేయొచ్చు కదా అని వర్మ కామెంట్లు చేశారు.ప్రజాస్వామ్య దేశంలో ఫాలోవర్లకు డైరెక్ట్ గా బ్రూటల్ వయోలెన్స్ ను ప్రభోదించడం తీవ్రవాదం కంటే ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.ఈ విధంగా హింసను ప్రోత్సహిస్తే ఆ సమావేశాలకు వచ్చే యువకులు భవిష్యత్తులో ఏమవ్వాలో పవన్ కే తెలియాలని వర్మ కామెంట్లు చేశారు.

లైవ్ మీడియా ముందు వయోలెంట్ బెదిరింపులు ఏంటని వర్మ అన్నారు.అయితే వర్మ కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు.రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో వర్మ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.







