గణపతి ( Ganapati )ఓంకార స్వరూపుడని వేద ఋషులు కీర్తిస్తారు.సర్వ జగత్తుకు వినాయకుడి అగ్రపూజ్యుడు అని దాదాపు చాలామందికి తెలుసు.
గణపతి విఘ్నాలను తొలగించే ఆది దేవుడు.విఘ్నాలకు అధిపతిగా విఘ్నా నాశకుడిగా గణపతి ప్రసిద్ధుడు.
అందుకే గణపతిని తలచుకుని శుభకార్యాలు మొదలుపెడితే అవి ఎలాంటి విఘ్నాలను లేకుండా పూర్తి చేయవచ్చు.గణపతి నీ పూజించే వారిని గాణపత్య సంప్రదాయకులని అంటారు.
ఈ సంప్రదాయం పాటించేవారు గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు.గణపతి చాలా రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తాడు.
వాటిలో మహాగణపతి, పసుపు గణపతి, ఉచ్చిష్ట గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి వంటి ఎన్నో రూపాలు ఉన్నాయి.
శ్రీ మహాగణపతి ( Shri Mahaganapati )ముఖం అత్యంత శ్రేష్టమైన గజముఖం.స్వామి తలపై అర్థ చంద్రుడు విరజిల్లుతూ ఉంటాడు.గణపతి దేహ కాంతి అరుణ వర్ణంతో శోభిల్లుతు ఉంటుంది.
స్వామికి మూడు కన్నులు ఉంటాయి.తన ఒడిలో కూర్చున్న భార్యను పద్మాల వంటి చేతులతో సదా లింగనం చేసుకుని ఉంటాడు.
మహాగణపతి తన పది చేతుల్లో దాడిమ,గద,ధనస్సు, త్రిశూలం, చక్రం, పద్మం, పాశం, కమలం,ధాన్యగుచ్చం, స్వదంతం, రత్నకలశం పట్టుకుని దర్శనం ఇస్తాడు.అలాగే మహాగణపతి గణ్డయుగళం( Gandyugalam ) నుంచి వచ్చే తీపి ధారలను తాగాలని వచ్చే భ్రమర సమూహం ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటాయి.
వాటిని ఆయన తన చెవులతో తనుముతుంటాడు.
ఇంకా చెప్పాలంటే తంత్రసారంలోని ద్వితీయ పరిచ్ఛేదంలో హరిద్ర గణపతిని( Haridra Ganapati ) ఎన్నో విధాలుగా కీర్తించింది.హరిద్ర గణపతి శరీరం పసుపు రంగులో ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే స్వామి పసుపు రంగు వస్త్రం ధరించే దర్శనమిస్తాడు.
హరిద్రా గణపతి నాలుగు చేతుల్లో పాశం, అంకుశం, మేధకం, దంతం విరుజల్లుతూ ఉంటాయి.ఈ గణపతి స్వరూపాన్ని అత్యంత మార్మిక రహస్యంగా మహర్షులు భావిస్తారు.
LATEST NEWS - TELUGU